రాగం... హంసధ్వని రాగం
తాళం... ఆది తాళం
సాంగ్... శ్రీ గణనాయక
సాకి..
వందే సిద్ధి వినాయక..ఆ..ఆ..ఆ
వందే బుద్ధి ప్రదాయకం..ఆ..ఆ..ఆ
నటరాజ సుతం వందే
వందే....... విఘ్న దాయకం
వందే....... విఘ్న దాయకం
పల్లవి..
శ్రీ గణనాయక వినాయక
కొలిచేద మయ్య ముందుగా నిన్నే
చరణం..
మూషిక వాహన మునిజన వందిత
ముల్లోక పూజిత ప్రణవస్వరూప
నిరతము నిన్నే కొలిచెదమయ్యా...
కనికరమున మము కావుము దేవా...||శ్రీ గణనాయక||
చరణం..
ఏకదంత గుణవంత వినాయక
శ్రీ గణేశహే శాంతినికేతన
విద్యా దాయక బుద్ధి ప్రదాయక
పరమ నిరంజన పాహి గజానన ||శ్రీ గణనాయక||
ఎత్తు బడి..
జయ జయ జయ జయ జయ గణనాద
విఘ్నము చేయక విఘ్నేశ్వరాయ
సకల విద్యలకు ఆది పూజిత
సర్వసృష్టికి సర్వోత్తముడవు
వైకుంఠేశుడు హిమగిరి వాసుడు
భద్రాద్రిశుడు తారక రాముడు
ఎందరు దేవుళు కొలువై ఉన్న
కొలిచెద మయ్య ముందుగా నిన్నే||జయ జయ||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
