శ్రీ గణనాయక వినాయకా - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


శ్రీ గణనాయక వినాయకా
కొలిచెదమయ్యా ముందుగ నిన్నే

మూషిక వాహనా మునిజన వందితా
ముల్లోక పూజితా ప్రణవా స్వరూపా
నిరతము నిన్నే కొలిచెదమయ్యా
కనికరమున మము కావుము దేవా

ఏకదంతా గుణవంతా వినాయకా
శ్రీ గణేశా హే శాంతినికేతన
విద్యాదాయక బుద్ధి ప్రదాయక
పరమ నిరంజన పాహి గజాననా

జయ జయ జయ జయ జయ గణనాదా
విఘ్నము చేయకు విఘ్నేశ్వరాయా
సకల విద్యలకు ఆది పూజిత
సర్వ సృష్టికి సర్వోత్తముడవు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat