జయతు జయతు రంగనాధా శ్రీ పాండురంగ - శ్రీ కృష్ణ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


సాకి    :- నమౌ శ్రీ పాండు రంగా నమో శ్రీ పుండరికవరద
             నమో...విఠలా...విఠలా...అ

పల్లవి  :- 

జయతు జయతు రంగనాధా శ్రీ పాండురంగ
పండరి పుర విఠల పరంధామ
పాహిమురారి వైకుంఠం ధామా.              ౹౹జ౹౹


చరణం:- 

చంద్రభాగ తీరాన ఇటుక రాతిపై నీవు
కదలక నిలిచావయ్య మోక్ష ప్రదాతవై - 2

నీవన్న ఈ పండరి మా పాలిటి పెన్నిధి అఅఆ -2

అనిషం నిను వేడేము మొర వినుమో శ్రీ రంగ.౹౹జ౹౹


చరణం:- 

తుకారం సక్కుబాయి నీ గానం సల్ప
పరమపదం నొందిరి పాండురంగ నీ దాసులు - 2
నీవే దిక్కని నమ్మిన మము బ్రోవుము రంగయ్య అఅఆ-2
రుక్మిణీ వల్లభ పాండురంగ జయతు శ్రీ పండరి నాద జయతు.౹౹జ౹౹


రాగం          :- అభేరి రాగము
తాళం         :- తిశ్రగతి తాళము
గీత రచన   :- కవి శ్రీ డి.తిరుపాలు గారు
స్వరకల్పన :- (       ,,          ,,         ,,     )


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat