ఏ చోట చూసినా నీ వుందు వందురే
ఏ పేరు పిల్చినా పలుకుతావందురే
మనసు నీ వశమాయె యిక మౌన మేలా
మమ్ము బ్రోవగ రావ ఇక జాలమేలా మాటాడవేలా
మనసే నీ వశమాయెను మౌనం దాల్చెద వేలనో
మనసే నీ వశమాయెను
కలవర మాయే మనసంతా ఈ సంసారంబే ఒక సంతా
కలలోనైనా మెలకవనైనా నీ ధ్యానమె నా మనసంతా
అలజడి చెందిన నా మనసు ఆనందం పొందే దెన్నటికో
పరవశమొందిన నా మనసు నిను మరువక తలచును కడవరకు
ఉరకలు వేసె ఆశలతో పరుగులు తీసితి గతమంతా
స్థిరమైనది నీ నామంచేనని చేరితి నిప్పుడు నీ చెంతా
పిలచి పిలచి నే అలసితిని నీ సన్నిధిలోనే నిలిచితిని
పలుకవు ఉలకవు జాగేలా పరీక్ష లింకా నాకేలా