పిలిచిన పలికే శ్రీరామా
పావననామా రఘురామా
కోరిన వరముల నిచ్చే రామా
కొండంత ఆపద తీర్చే రామా
జనకుని మాటపై కానల కేగిన
అల్పుని నెపముపై సీతను వీడిన
దశరధ రాముడ నీవయ్యా
అందుకే ఆదర్శమైనావయా
భద్రాచలమున వెలసితివయ్యా
భక్తుల మదిలో నీవయ్యా
ఆడిన మాటే వేదమని
నిరూపించిన శ్రీరామా
నీ రూపమే జీవన దీపమై
మా ప్రార్ధన నీకే చెరనీ
చిరకాలం మము దీవించాలనీ
ఆర్ధిస్తున్నాం ఆ దేవునీ
అర్ధిస్తున్నాం మా రామునీ