నవరాత్రులు: శరన్నవరాత్రులు - శ్రీ అన్నపూర్ణా దేవి Navratri Shri Annapurna Devi

P Madhav Kumar

 


శ్రీ అన్నపూర్ణా దేవి

రంగు:  గంధం
పుష్పం:  పొగడ
ప్రసాదం:  దద్దోజనము

దసరా ఉత్సవాలలో మూడవ రోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము.

పూజా విధానము

  • పుష్పములు: అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి.
  • మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత  మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.
  • నివేదన: దధ్యన్నము, కట్టెపొంగలి
  • పారాయణ: అన్నపూర్ణ అష్టోత్తరము, స్తోత్రములు



నవరాత్రులు 3వ రోజు - శ్రీ అన్నపూర్ణా దేవి
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉🕉️🕉

♦️నేడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణా దేవిగా అలంకరిస్తారు:

అలంకరించే చీర రంగు: పసుపు రంగు

నైవేద్యం: క్షీరాన్నం, దద్దోజనం, గారెలు

శ్రీ అన్నపూర్ణా దేవి స్తోత్రం :

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |

ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

శ‌ర‌న్నవ‌రాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా ద‌ర్శన‌మిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ త‌ల్లిగా కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. అన్నపూర్ణ‌.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము…అమ్మవారు మన‌కు ఇస్తుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.

అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది.

ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.

దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.

ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.

‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.

‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

దీపావళిరోజున కూడా కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తుంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి.

శ్రీ మాత్రే నమః..🙏🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat