శ్రీ గాయత్రీ దేవి
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే
శ్రీ గాయత్రీదేవి
రంగు: నారింజ
పుష్పం: తామర
ప్రసాదం: పులిహోర, పాయసం, లడ్డూలు*
శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.
సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతః కాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజొవంతము అవుతుంది. గాయత్రీ మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి అల్లపు గారెలు నివేదన చేయాలి.
*గాయత్రీదేవి అవతార అంతరార్థం*
హిరణ్యగర్భ విద్యననుసరించి వేదశాస్త్రములు, సకల జగత్ సృష్టికి సూర్యుడే ఆధారం. సూర్య మండలం ఆగ్నేయమున ఉంది కావున దీనిని హిరణ్మయము అని అందురు. ఈ హిరణ్మయ మండల కేంద్రమున సూర ్య రూపుడైన పరబ్రహ్మతత్త్వము ప్రతిష్టించబడింది కావున, బ్రహ్మను హిరణ ్యగర్భుడు అంటారు. ఈ సూర్యభగవానుని శక్తే (అతని కాంతియే) గాయత్రీ. ఈమెకు మరో పేరు సావిత్రి. సావిత్రి అనగా ‘సవిత: ఇయం’ అని వ్యుత్పత్తి. సవిత అనగా సూర్యుడు. సూర్యకాంతి, సూర్యతేజస్సే సావిత్రి. సూర్యశక్తిని తార, గాయత్రి, సావి త్రి అని అంటారు. సూర్యభగవానుడు బృహతీ అను మహా విశ్వగోళ మధ్యభాగంలో స్థిరంగా ఉంటూ లోకాన్ని ప్రకాశింపచేస్తాడు.
*” సవితు: వరేణ్య భర్గ: ధీమహి | యోన: ధియ: ప్రచోదయాత్ ||”* అని మంత్రము.
ఈవిధంగా సూర్యభగవానుని సర్వశ్రేష్ఠమైన తేజస్సును ధ్యానం చేయడం ద్వారా ఆ తేజస్సే మన బుద్ధిని మంచి దారిలో ప్రేరేపించునని గాయత్రీ మంత్రార్థము. ఇతర ఆగమములానుసారం నారాయణుని రూపమే సూర్యభగవానుడు. కావున నారాయణుని దివ్యకాంతియే గాయత్రీ. గాయత్రీ అనగా ‘గాయంతం త్రాయత ఇతి గాయత్రీ’ అనగా గానము, ధ్యానము చేసేవారిని రక్షించేది.
స్త్రీ రూపమైన గాయత్రీ ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ ఛాయై: అని ఐదు రంగుల గల ఐదు ముఖములు అలాగే చంద్రశేఖర తత్త్వమున మూడునేత్రములను, పది చేతుల్లో పది రకాల ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈ రూపం పరమాత్మను చేరవలసిన జీవాత్మ స్వరూపం. అమ్మ ఐదు ముఖాలలో ‘ముక్త’ పరమాత్మ స్వరూపం, ‘విద్రుమ’ జీవాత్మ స్వరూపం, ‘హేమ’ ప్రాప్తి ఉపాయం, ‘నీలం’ ప్రాప్తికి విరోధి, ‘ధవళ’ ప్రాప్తి ఫలం. పది చేతులలోని పది ఆయుధాలు ఇంద్రియాలు చేయవలసిన పది పనులు. జిహ్వ, నాసిక, నేత్రములు మొదలగు ఈ పది ఇంద్రియములు పరమాత్మ యొక్క సేవకు, ధ్యానించుటకు ఉపయోగించాలి. ఈవిధంగా ఇంద్రియాలనే చేతులలో కర్తవ్యాలను ఆయుధాలుగా చేసుకుని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ద్వేష, అసూయ, ఈర్ష్య, స్వార్థం అనే పదిమంది శత్రువులను గెలవాలని గాయత్రీ మాత అవతార ఉపదేశం. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆచరించి, అనుసరించి అమ్మ అనుగ్రహం పొందాలి.
అందరూ పఠించదగిన గాయత్రీ మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాధానమైనవి మూడు. సంధ్యాకాలాలలో వీటిని జపిస్తే "గాయత్రి" అవుతాయి.
1. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్!
2. పరమేశ్వర విద్మహే పరతత్త్వాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్!
3. యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః! ప్రేరయేత్తస్య తద్భర్గః తద్వరేణ్య ముపాస్మహే!!
🌻గాయత్రీ దేవి అవతారం విశిష్టత..
సకల వేద స్వరూపిణి గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంతం మంత్ర శక్తి కలుగుతుంది. నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.
ఓం బ్రహ్మకుండికాహస్తాం..శుద్ధ జ్యోతిస్వరూపిణీంl
సర్వతత్త్వమయీంక..వందే గాయంత్రీం వేదమాతరమ్ll
నేడు కనకదుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందింది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టానదేవత. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు.
🌻చరిత్ర:
పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు.
అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు" అన్నాడు.
బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి
మొఱ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు.
బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి," మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు. దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి! అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, "రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు "అని సమాధాన మిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము. దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి, గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.
గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.
గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.
అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి ,భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి , వినడానికి అవకాశం లేకుండై, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా తేశాయి. దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద. చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది(ఆఱు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.
తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.
ఈ కథ చెప్పి , వ్యాసమహర్షి గాయత్రీ మంత్రజప ప్రభావాన్ని వివిరించగా, జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినిలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాసమహర్షి కొనసాగించాడు.
గాయత్రీ పరాశక్తి స్వరూపము.
అమెకు ఐదు ముఖాలు, ఈ ఐదు ముఖాలూ సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. ఐదు శిరస్సులతో, పదిచేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది.
శ్రీ మాత్రే నమః..🙏🙏