కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి ?

P Madhav Kumar


ఇంటి గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే కానీ..


ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం "గడప"కు పూజ చేయడం.


ఇంటి గడపను సింహ ద్వారమని లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు.


గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడం.


ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం.

పెళ్లి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసిన కుదరక జాతకాల విషయంలో అంతరాయాలు ఏర్పడే వాటికి కట్న, కానుకల విషయంలోను ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు 16 రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి.


పూజ విధానం 

1. ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి 16 రోజులు పాటు ఆటంకం లేకుండా అదే సమయంలో చేయాలి.


2. మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి. తర్వాత పాలుపోసి కడగాలి అంటే అభిషేకం చేసిన విధంగా కొద్దీ పాలతో పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి.


3. గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి.


4. చిన్న పళ్లెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవునైయి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి.


5. ఇంకో పళ్లెంలో బెల్లం అటుకులు, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకునే మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకుని వెంకటేశ్వరస్వామి అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకుని హారతి ఇవ్వాలి.


6. గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి.


7. పూజ అయిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు, ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోయిన పర్వాలేదు.


8. ఆ పదహారు రోజులు పూజ గదిలో దీపం వెలిగించిన చాలా శుభం.

పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం 3 గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి. లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబందించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకుని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకుని పదహారు రోజులు ఈ గడప పూజ చేయవచ్చును.


ఇంట్లో సమస్య ఇంటిపైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటి పైన ఉన్నను ఆ ఇంటి యజమాని కానీ భార్య భర్తలు ఇద్దరు కలసి కానీ భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకుని ఇంటి సమస్య తీరాలి అని వేడుకుని పైన చెప్పిన విధంగా గడపకు పూజ చేసి లక్ష్మి నారాయణ అష్టోత్తరం, మణి ద్వీపవర్ణన చదువుకుని హారతి ఇవ్వాలి. ఆ ఇంటిలో ఉన్న సమస్య తీరిపోతాయి. ఈ విధంగా గడపకు పూజలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించే వారు మన పూర్వీకులు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat