కార్తీక శుద్ధ అష్టమి - గోపాష్టమి...

P Madhav Kumar


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


చిన్ని కృష్ణుడు  తన ఐదవఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శు. అష్టమి.

    శ్రీ కృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజునుగోపాష్టమి' పర్వదినంగా జరుపుకుంటారు.


గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలని పురాణ కథనం,

ప్రతి దేవాలయంలో సామూహిక గోపూజను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్ఠతను తెలియజేస్తారు, 


ఈరోజు ముఖ్యంగా పంచగవ్య ప్రసాదాన్నివితరణ చేయాలి,

గోశాలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి. 


గోశాలలను శుభ్రపరచి , గోవులను అలంకరించి విశేషపూజలను జరుపుతారు, గో ఉత్పత్తుల తయారీ , ప్రదర్శన , చేసి అందరికి అవగాహన కల్పిస్తారు,


‘గో’ అనగా ‘గోమాత’. ‘గోపా’  అనగా ‘గోప బాలుడు’, కార్తిక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని ‘గోపాష్టమి’ గా పిలుస్తారు.


గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి , గోవు యొక్క పృష్ట భాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.


గోవు పరదేవతా స్వరూపము, గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి’. 

కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం.


*ఈ ‘శ్రీసురభ్యై నమః’* అనే మంత్రాన్ని జపించి , క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే , ఆయురారోగ్యైశ్వర్యాలు , అభీష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి, కీర్తి , ధనము , జ్ఞానము , క్షేమము ప్రసాదించే మహిమగల స్తుతి ఈ‘గోపాష్టమి స్తుతి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat