కార్తీక పౌర్ణమి - జ్వాలాతోరణం విశిష్ట

P Madhav Kumar


*🌹జ్వాలా తోరణం🌹*


🕉️

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది...

యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం...


యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి, వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష...


కార్తీక పౌర్ణమిరోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. 

ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. 


కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి... ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు, అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు...

దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. 

ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు...

ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.


శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ...


*కార్తీక వేళ భీమశంకరుని నగరమందు*

*దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు*

*వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ*

*ఘోర భీకర యమద్వార తోరణంబు*.. అంటాడు. 

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది...


*యమలోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం*. 

*యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ* *ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి*. 

*వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష*. 


ఈ శిక్షను తప్పించు కోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం అని అర్థం...

*అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది*. 

*అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు*. 


అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలని పురాణాలు తెలుపుతున్నాయి...


దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. *జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే ‘‘శివా ! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి, వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా*..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం.

*ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి - ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనోపెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని*.. 

*ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం*... 


*☀️శుభమస్తు☀️*

*🙏లోకా  సమస్త  సుఖినోభవంతు 🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat