భగవద్గీత
ఒక స్త్రీ 1 గంటకు పదికిలోమీటర్లు నడిస్తే, ఒక పురుషుడు అదే పదికిలోమీటర్లు నడవడానికి ఒకటిన్నర గంట సమయం తీసుకున్నాడు.
ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారంటే స్త్రీ అనిపిస్తుంది.
స్త్రీ చక్కగా ఉన్న దారిలోను పురుషుడు ఎత్తుపల్లాలు కొండలు గుట్టలు ఉన్న దారి ద్వారా వచ్చాడు.
ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు అంటే పురుషుడని అనిపిస్తుంది.
ఆ స్త్రీకి 60 ఏళ్ళని, పురుషుడికి 40 ఏళ్ళని, ఇప్పుడెవరు వేగంగా నడిచారు అంటే స్త్రీ అనిపిస్తుంది.
అదే పురుషుడు 140 kg, స్త్రీ 60 kg అని చెబితే పురుషుడు వేగంగా నడిచాడు అనిపిస్తుంది.
ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయలు మారిపోతూ ఉన్నాయి. స్థిరమైన అభిప్రాయాలు ఉండడం లేదు.
అందుకే ఏమీ తెలియకుండా ఎవరిని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు అభిప్రాయం చెప్పకూడదు, ఇదే జీవితం.