నీ నామ స్మరణ లేక శరణమయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణమయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
స్వామియే శరణం శరణమయ్యప్ప
" నీ నామ "
ఎరుమేలి చేరినాము శరణమయ్యప్పపేట తుళ్ళి ఆడినాము శరణమయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణమయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణమయ్యప్ప
" నీ నామ "
అలుద కొండ ఎక్కుతుంటే శరణమయ్యప్పకడుపు నిండా ఆకలాయే శరణమయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణమయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణమయ్యప్ప
"నీ నామ"
కరిమలనే ఎక్కుతుంటే శరణమయ్యప్పనా కళ్ళ నీళ్లు తిరిగే శరణమయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళతోని శరణమయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణమయ్యప్ప
" నీ నామ "
చిన్న పాద మేక్కుతుంటే శరణమయ్యప్పచిన్న పాన మేల్లిపాయే శరణమయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణమయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణమయ్యప్ప
" నీ నామ "
సన్నిధానం చేరినాము శరణమయ్యప్పమకర జ్యోతి చూసినాము శరణమయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణమయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణమయ్యప్ప
" నీ నామ "
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
