94. ఓయమ్మ మాయమ్మ కనకదుర్గమ్మ - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
1 minute read


ఓయమ్మ మాయమ్మ కనకదుర్గమ్మ
ఎల్లవేళల మమ్ము కాపాడవమ్మా
ఇంద్రకీలాద్రిపై వెలసినావమ్మా
ఇంద్ర భోగాలనే మాకీయవమ్మ //ఓయమ్మ//
జై జై దుర్గమ్మ జై కనక దుర్గమ్మ

కృష్ణవేణి నీకు పారాణి తల్లీ
మల్లికార్జునుడికే మారాణి వమ్మా
నీ ముక్కు పుడకకై కృష్ణమ్మ ఆశ
మాకొద్దు తల్లీ అటువంటి ఘోష //ఓయమ్మ//
జై జై దుర్గమ్మ జై కనక దుర్గమ్మ

విశ్వమాతవు నీవు విశ్వదాతవు నీవు
వినువీధి నీ హద్దు విస్తరించమ్మా
మహిషాసురుని చంపు కదన దుర్గమ్మా
సింహమ్ము నిను చూచి చినబోయెనమ్మా //ఓయమ్మ//
జై జై దుర్గమ్మ జై కనక దుర్గమ్మ
పిల్ల పాపల గాచు మురిపాల తల్లీ
మహిని అసురుల పాలి కోపాలవల్లి
జ్ఞాన భిక్షను పెట్టు ఘనమైన దేవతా
విజయమ్ము నందించు లోకైక పూజితా //ఓయమ్మ//
జై జై దుర్గమ్మ జై కనక దుర్గమ్మ


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat