కైలాసగిరివాస శ్రీ తుంబురీశ
శరణంటిమయ్య నీ చరణ సన్నిధిజేర
శరణంటిమయ్య నీ చరణ సన్నిధిజేర ...
శ్రీ తుంబురీశా...జయ తుంబురీశా
చరణం 1:
గంగా ఉదకము తెచ్చి అభిషేకమే జేసి
మారేడు దళములతో అర్చనలె జేసి
మనసార నిన్ను ధ్యానించితిమయా
శ్రీ తుంబురీశా.... జయ తుంబురీశా....
||కైలాసగిరివాస||
చరణం 2:ముల్లోక దేవతలు కొలిచేటి దేవర
ముక్కంటి నీ మహిమ చూపించరావా
కర్పూర గౌర...కరుణావతార
శ్రీ తుంబురీశా....జయ తుంబురీశా...
||కైలాసగిరివాస||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.