59. రావా శివయ్య స్వామి మా ఇంటికి Rava Shivaiah swamy ma intiki- శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

59. రావా శివయ్య స్వామి మా ఇంటికి Rava Shivaiah swamy ma intiki- శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

రావా శివయ్య స్వామి మా ఇంటికి...

మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి... కోరస్ రావా శివయ్య స్వామి మా ఇంటికి...

మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి... కోరస్

తన రెక్కల సహాయముతో నీ గుడి నిర్మించినట్టి...

సాలె పురుగు నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా...

కోరస్(సాలె పురుగు నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా...)

||రావా శివయ్య స్వామి||
ఏటికెళ్లి గంగ తెచ్చి అభిషేకం చేసినట్టి...

గజరాజును నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా... కోరస్(గజరాజును నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా...)

||రావా శివయ్య స్వామి||
ఆభరణం లేని నీకు ఆభరణం అయ్యినట్టి...

కాలనాగు నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా... కోరస్(కాలనాగు నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా...)

||రావా శివయ్య స్వామి||

నీయందు భక్తి తోటి తన కనులను పెట్టినట్టి...

కన్నప్పను నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా... కోరస్(కన్నప్పను నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా...)

||రావా శివయ్య స్వామి||
తన తనయుని తలా నరికి నైవేద్యం పెట్టినట్టి...

శిరియారుని నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా... కోరస్(శిరియారుని నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా...)

||రావా శివయ్య స్వామి||

తన కడుపులో పేగులతో వీణను మోగించినట్టి...

రావణుడను నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా... కోరస్(రావణుడను నేను కాదయో శివయ్యా... అంత భక్తి నాకు లేదయో శివయ్యా...)

||రావా శివయ్య స్వామి||
మాఘ మాసమందు స్వామి నీ మాలలు వేసినట్టి...

నీ భక్తుడు నేను చూడయో శివయ్యా... నీకు సేవ నేను చేద్దును శివయ్యా... కోరస్(నీ భక్తుడు నేను చూడయో శివయ్యా... నీకు సేవ నేను చేద్దును శివయ్యా...)

||రావా శివయ్య స్వామి||

రావా శివయ్య స్వామి మా ఇంటికి... మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి... కోరస్ మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి... కోరస్ మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి... కోరస్


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.




Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow