Magha maasam Vijaya Ekadashi - మాఘమాసంలో కృష్ణ పక్ష ఏకాదశి - విజయ ఏకాదశి

P Madhav Kumar
3 minute read


*మాఘమాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు.*

యుధిష్టిర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అన్నాడు  *" ఓ వాసుదేవ , ఈ మాఘ మాసం కృష్ణ పక్షం* *లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరగా "*


*శ్రీ కృష్ణ పరమాత్మ :*

ఓ యుధిష్టిర , ఈ మాఘ మాసం లో వచ్చే టువంటి ఏకాదశి పేరు *"విజయ ఏకాదశి"*. ఈ ఏకాదశి ని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది , మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి. 

ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను , అప్పుడు బ్రహ్మ ఈవిధంగా చెప్పనారంబించెను.

ఓ నారద మహా ముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు , నువ్వు అడిగినావు కావున నీకు తెలియ చేసెదను వినుము . ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది . ఈ పేరు లో చెప్పిన విదంగానే ఈ ఏకాదశి వ్రతం అనీ విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు. 

శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు , సీత , లక్ష్మనుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు . రావణుడు సీతాదేవి ని అపహరించినప్పుడు శ్రీ రాముడు దిగులుతో అన్ని కోల్పోయినవాడిలా ఉండేను సీతాదేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినదని అడుగగా , జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో , సీతామాతని కాపాడబోయి రావణుడు చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరణిస్తాడు . శ్రీ రాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువి కి వైకుంఠ లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు . 

అటు తరువాత శ్రీ రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తాయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంక కి వెళ్లి వెతకమని అజ్ఞాపిస్తాడు.   హనుమ లంకలో సీతమ్మని అశోకవనం లో చూసి శ్రీ రాముని ముద్రికని చూపి , అయన గుణగణాలను కొనియాడి , హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తెసుకుని తిరిగి శ్రీ రాముని వద్దకు వచ్చి వివరించెను. శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరానికి చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాన్నీ దాటడం అంత సులువు కాదని గ్రహించి , లక్ష్మణునితో ఎలా అన్నాడు , ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదె ఇప్పుడు మనం ఏమి చెయవలేను 

అందరిలోకి మంచివడివైన శ్రీ రామ , బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగరలోనే ఉన్నారు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యం ఏమిటో కనుకుందాం. అయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు నాయి సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు. 

బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు . 


*బలదలబ్య* 

శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము , దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లబిస్తుంది . 

ఏకాదశి ముందు రోజు ఒక వెండి , ఇత్తడి , లేదా , బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీళ్లు పోసి నవధాన్యాలు , పసుపు కుంకుమ వేసి , కుండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి. దీనినీ శ్రీమన్నారాయణుని దగ్గర పెట్టాలి . మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నారాయణు కి పూజ చేసి , ఈ కుండకి కి పసుపు కుంకుమ , గంధం , అక్షింతలు , వేసి నమస్కరించి ఉపవసింఛి రాత్రి కి జాగరణ చేయాలి . మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి అ కుండకి పూజ చేసి ఏదయినా ఒక నది లో కలిపేయాలి. తరువాత ఉత్తముడయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి. ఈ విధంగా నువ్వు ని సేన ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లబిస్తుంది అని చెప్పేను. 

శ్రీ రామచంద్రుడు బలదలబ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికీ వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది . 

ఓ నారద ఈ విధంగ ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకం తో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారు అతి చెండాలమయిన పాపాలు అయిన హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంఠ లోక ప్రాప్తి లబిస్తుంది. 

అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి , యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో , ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం లబిస్తుంది అని చెప్పేను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat