ఏమి మాయరా బ్రతుకు తెలుసు కొమ్మురా జీవ
ఇది ఏమి మాయరా బ్రతుకు తెలుసు కొమ్మురా జీవ
సంసారమె సాగరమూ అందులోన నావ నీవు
ఏ గాలీ వీచునో ఏ తాకిడి తాకునో
చివరకు నీవేమౌదువొ తెలుసుకొమ్మురా జీవ
ఉన్ననాడు నీ వారూ లేని నాడు ఎవరు కారు.
తనవారూ యెవ్వరో పరవారూ యెవ్వరో
చివరకు నీ వెంటవచ్చు వారెవరురా జీవ
.
నాది నాది యన్నదీ నీదేదీ కాదురా
వయసేమో పెరుగును మరణమేమొ చేరును
ఇకమైనా మేలుకొని రాము భజన చేయరా
15. ఏమి మాయరా బ్రతుకు తెలుసు కొమ్మురా జీవ - Ami mayera bratuku - భజన పాటల లిరిక్స్
April 13, 2025
Tags
