36. ఏల మాటాడవే । ఓ రామయ్యా.....!। యెంత కఠినుడవే - Ela matadave o ramaiah - శ్రీరామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read

ఏల మాటాడవే । ఓ రామయ్యా...!। యెంత కఠినుడవే 

ఏల నీ దయ రాకయున్నది-ఏమి సేయ దలంచినాడవు 

నీలవర్ణా నీదు సత్కృప-చాలగా మది నమ్మినాడను ॥


నీకే చేయి జాచితి | లోకులనెల్ల | జూచి వేసారితి 

జోకతో నీవాడ ననుచును-చూచి చూడ వదేమిచిత్రము 

నీ కటాక్షము సోకకను యెం-దాక యోర్తును లోక సుందర 

॥ఏల॥

మ్రొక్కి వేసారితి । నామనసందు। ముందె నిను గోరితి 

గ్రక్కున నన్నాదరించెడు-ఘనుడ వనుచును వేడుకొంటివి 

ఒక్కసారి నాదు చిత్తము-ఓప దాయెను ముచ్చటాడవె

॥ఏల॥

సంతసించగదే । రాకమచెర్ల | స్వామి నీవె గదే

వంతుకైనను కరుణ జూడవు-ఓపజాలను నామనంబున 

పంతమేమి దలంచకుర నీ-బంట నైతిని ధర్మసాక్షిగ

॥ఏల॥


ఈ లిరిక్స్ పంపించినవారు:

భైరంపల్లి భజన మండలి 

మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి. 



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat