65. ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి…Evvaradigithe janma nichitivi - శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

65. ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి…Evvaradigithe janma nichitivi - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి…
పరమాత్మ ఈ తనువు
ఎందుకిచ్చి మోసబుచ్చితివి.... || 2 ||
ఇవ్వమని నేనడుగలేదు
ఈశ్వరా యని కోరలేదూ.. || 2 ||
ఎవరితో నేనేమి చెప్పుదు || 2 ||
నవ్వులాట ప్రపంచమందునా...
 
ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి
పరమాత్మ ఈ తనువు
ఎందుకిచ్చి మోసబుచ్చితివి....
ఎప్పుడూ నిన్నేమి కోరితినా...
సర్వంబు నీవని చెప్పక నా మదిలో మరచితినా..
తప్పులెరుగని తనవులకు ఈ తిప్పలెందుకు వచ్చెనో మరి....
ఆ.. తప్పులెరుగని తనవులకు ఈ తిప్పలెందుకు వచ్చెనో మరి....
చెప్పరా ఏ తప్పు చేసినా చెప్పరా ఏ తప్పు చేసినా
ఇప్పుడే సరి దిద్దుకొందునూ...
 || ఎవ్వరడిగితే ||
ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి
పరమాత్మ ఈ తనువు
ఎందుకిచ్చి మోసబుచ్చితివి....
ధనము ధాన్యము ఇవ్వమంటినా...
నిన్నెప్పుడైనా ధనము రాశులు సంపదలు కోరితినా
తనువు మనవు ధనము నీకు దారపోసిన తెరగి యుండగా
ఆ.. తనువు మనవు ధనము నీకు దారపోసిన తెరగి యుండగా
దిన దినంబున గడువు లేకనూ
దిన దినంబున గడువు లేకనూ దిక్కు తోచని మాయజన్మమా 
 || ఎవ్వరడిగితే ||
నమ్మినందుకు నన్ను మరువకనూ
కడసారి కోరికా.. కోరినందుకు వేరు చేయకనూ
ఇమ్మ ఈ ఈ ముసలి తనవులకు
ఉన్న చిక్కులు తొలగజేసి
ఆ... ఇమ్మ ఈ ఈ ముసలి తనవులకు
ఉన్న చిక్కులు తొలగజేసి
సమ్మతంబుగ దీక్ష కవితా...
సమ్మతంబుగ దీక్ష కవితా
నన్నదే నిజమనుచు నమ్మి 
 || ఎవ్వరడిగితే ||


లిరిక్స్ పంపించినవారు:
భైరంపల్లి భజన మండలి 
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా 


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.



Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow