రాగం : ఆరభి తాళం : ఆది
రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి
రక్షించు జగదీశ్వరి
తేజస్వరూపిణి దైత్య సంహారిణి
త్రిజగద్భగవతి శరణు నిన్నే నమ్మితి
రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి
రక్షించు జగదీశ్వరి
శుక్రవారపుపూజ శుభ దినములలోన
కొలువై యుండగా చూడగా
అడిగిన వారికి అభయమిచ్చే తల్లి
అతులిత భాగ్యములొసగు సర్వేశ్వరి
రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి
రక్షించు జగదీశ్వరి
అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి
కోటి సూర్య ప్రకాశిని
కంచి కామాక్షి మధుర మీనాక్షి
కాశీ విశాలాక్షి కరుణించు ఈశ్వరి
రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి
రక్షించు జగదీశ్వరి
~~~ * ~~~