చిన్ని చిన్ని బాలుడే మణికంఠ
చిన్నారి పసి బాలుడే
||చిన్ని చిన్ని||
శివకేశవుల ముద్దుబిడ్డగా మణికంఠపసిబాల రూపాన జన్మించినాడే మణికంఠ
పుట్టగానే నాగు నీడలో మణికంఠ
శయనించిన పంబ బాలుడే మణికంఠ
వేటకోచ్చిన రాజును చూడే
పసిబాల రూపాన కనిపించినాడే
||చిన్ని చిన్ని||
పందాల రాణి ఓడి లోనా మణికంఠలాలలు పోసే భాగ్యము పొందే మణికంఠ
చందమామ కథలను చెప్పి మణికంఠ
గోరుముద్దలే తినిపించినాదే మణికంఠ
ఆ తల్లి తండ్రి ఓడి లోన
నిదురించిన దేవుడవయ్యా
||చిన్ని చిన్ని||
గురువు సన్నిధిలో చేరినవయ్యా మణికంఠవేద విద్యలే నేర్చినవయ్యా మణికంఠ
పుట్టి మూగ గుడ్డివాడికే మణికంఠ
రెండు కళ్ళనే ఇచ్చినావయ్యా మణికంఠ
గురుస్వామి బాధను చూసినవయ్యా
గురు దక్షిణే తీర్చినవయ్యా
||చిన్ని చిన్ని||
ఆ తల్లి మాటను జవదాటక మణికంఠపులిపాలకే బయలుదేరేనా మణికంఠ
ధనసు భాణమును చేతబట్టిన మణికంఠ
అటుకులు బెల్లం మూట గట్టిన మణికంఠ
అ ఘోర అడవిలో పయనించినాడ
మహిషి మర్దనం మర్దించినాడ
||చిన్ని చిన్ని||
పులి పైన ఎక్కి వచ్చిన మణికంఠపులిపాలనే తెచ్చినవయ్యా మణికంఠ
శబరి కొండపై బాణమిసేరేనా మణికంఠ
దివ్య మెట్ల పైన కొలువుదీరిన మణికంఠ
ఆ తల్లిదండ్రుల ఆశ మేరకే
కాంతగిరిపై జ్యోతిగా వెలిగే
||చిన్ని చిన్ని||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
