నీ బుడిబుడి అడుగుల సవ్వడి నవ్వుతా స్వామి వరమిస్తే "2"
మనిషిగా పుట్టుట మంచిదని అంటారు జగమున అందరూ
ఆ జగన్నాధుని ఆటని తెలియక మురిసెను మూర్ఖులు
అమ్మ నాన్న ఆలీ బిడ్డ అంతా మాయెరా
బ్రహ్మ విష్ణు మహేశ్వరులాడే చదరంగపు ఆటేరా
" నీ కాలికి"
ఒకే రోజులో వాడే పూలకు ఎన్నో వర్ణాలు
అంతా ఒకటిగా పుట్టిన మాలో కుల మత భేదాలు
ప్రతి పువ్వు నీకై పూజకు చేరును ఎంతటి పుణ్యమురా
హరిహర తనయ మా కాపుణ్యం ఏ జన్మలో కలుగును రా
"నీ కాలికి"
నాటి రాక్షసులు నేడు కూడా భూమిపై పుట్టారు
పుడమి తల్లిని ముక్కలు చేసి అమ్ముకు తిన్నారు
పుడమిని నమ్మిన రైతు బిడ్డలకు పుస్తెలు లేవు
ఇక్కడ పురుగుల మందే ఆకలి తీర్చేను మా రైతన్నలకి ఇక్కడ మా రైతన్నలకు
"నీ కాలికి"
కపటముతోనే కాసులు పండు కలియుగమందున
కపటము తెలియని కష్టజీవులకు కడుపేయుండున
పసి పిల్లలు తాగే పాలు కూడా మరి కలుషితమి
ఏమని చెప్పను ఎంతని చెప్పను తండ్రి నీకు తెలియనిదా
"నీ కాలికి"
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
