తిరుమల వేంకటరమణ మరుమోహన మంగళచరణ
సురజీవన జగదావన - పరమాత్మ బ్రోవుబిరాన.
॥తిరుమల॥
చరణం: 1 కరిరాజు నేలిన దొరవు - కరుణా సముద్రుడ నీవు
వరదాయక శ్రీనాయక - దరిచేర్చనేలను సబబు
॥తిరుమల॥
చరణం: 2 నిరుపేదవాడను స్వామి - దరహాసమున గనవేమి
విరినయ్య నీ చరణాలపై - దరహాసమున మననీయీ
॥తిరుమల॥
చరణం: 3 సన్యాసిరావార్చితనీ - సాంగత్యమును కోరితిని
సరసీరుహ నయనానిను - సంతోషముగ కొలిచితిని
॥తిరుమల॥
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
