Yogini Ekadashi - జ్యేష్ట మాసం కృష్ణ పక్షం - యోగినీ ఏకాదశి
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Yogini Ekadashi - జ్యేష్ట మాసం కృష్ణ పక్షం - యోగినీ ఏకాదశి

P Madhav Kumar

మన హిందూ ఆచారాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ విధంగా సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటిని విష్ణుమూర్తికి అంకితం చేస్తారు.

కానీ జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి అన్నిటికన్నా ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు.

అసలు యోగిని ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలి. ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున కఠిన ఉపవాస దీక్షలతో విష్ణు దేవుడికి పూజలు చేయటం వల్ల సర్వపాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.

ఏకాదశి వ్రతంలో ఉన్న అంబరీషునిపై కోపించినందుకు శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం దూర్వాసుని వెంటాడిన కథ మనకు తెలిసిందే. మురాసుర సంహార సమయంలో విష్ణుదేవునికి సహకరించిన శక్తికే ఏకాదశి అనే పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం పౌర్ణమికి, అమావాస్యకు తరువాత వచ్చే 11వ రోజును ఏకాదశి అని పిలుస్తారు.

హిందూ ధర్మం ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే ఏకాదశులన్నీ శ్రీమహావిష్ణువుకు అంకితం చేశారు. జ్యేష్ట మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేసినా, ఆ వ్రత కథ విన్నా ఎంతో పుణ్యం లభిస్తుందట.

యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఉతికిన బట్టలను ధరించాలి. గంగా జలంతో పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. శ్రీమహావిష్ణువును స్మరించుకుంటూ యోగిని ఏకాదశి పూజ ప్రారంభించాలి. విష్ణు విగ్రహం లేదా చిత్ర పటం ఎదుట పసుపు రంగులో ఉండే. పూలు, ఐదు రకాల పండ్లను. తులసి ఆకులను ఉంచాలి.. అనంతరం విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఇదే రోజున సాయంత్రం సమయంలో కూడా శ్రీమహా విష్ణువును పూజించాలి.

యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతారు. తెలియకుండా చేసిన పాపాలనుండి విముక్తి లభిస్తుంది. పూర్తి విశ్వాసంతో ఈ రోజున ఉపవాసం చేస్తే వేలాది మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. పురాణాల ప్రకారం యోగిని ఏకాదశి వ్రత కథను శ్రీక్రిష్ణుడు చెప్పాడు. ఓ రాజ్యంలో కుబేరుడు అనే రాజు ఉండేవాడు. తను శివ భక్తుడు. ఆయన ప్రతిరోజూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శివుడిని స్మరించుకునేవాడు. పూలను సమర్పించేవాడు. తన కోసం తోటమాలి ప్రతిరోజూ వనం నుండి తప్పనిసరిగా పువ్వులు తెచ్చేవాడు. అతనికి అందమైన భార్య ఉంది. తనతో కలిసి అక్కడే నివాసం ఉండేవాడు. ఒకరోజు తోటమాలి ఉదయాన్నే నిద్ర లేచి పువ్వులు తీసుకోవడానికి వెళ్లాడు. అయితే రాజు ఆలయానికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, తన ఇంటినుండి ఆలయానికి వెళ్లే మార్గంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని భావించాడు. ఈ ఆలోచనతో ఇంటికి తిరిగి వెళ్లాడు. తన భార్యను చూస్తే ఆరోజు మరింత అందంగా కనిపించింది. తనలో సంతోషం పెరిగింది. ఆమె ధ్యాసలో పడి పూజకు ఇవ్వాల్సిన పూలను మరచిపోయాడు.

ఎంతసేపైనా ఆ తోటమాలి పూలు తీసుకురాకపోవడంతో ఆ రాజు అతన్ని వెతకమని భటులను ఆదేశించాడు. భటులు అతన్ని గురించి వెతకగా ఇంటి దగ్గరే తన భాగస్వామితో కామకేళి చేస్తున్నాడని, అందుకే పూలు తీసుకురాలేదన్న విషయం వారికి తెలిసింది. అదే సమాచారం రాజుకు చెప్పారు భటులు. తన కోరికల వ్యామోహంలో పడి శివుడికి పూలు తీసుకురావడం మరిచిపోయినందుకు అతడు వ్యాధుల బారిన పడ్డాడు. అప్పటి నుండి ఆ తోటమాలి ఎంతో బాధపడుతూ. తన సమస్య పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు.

ఓ రోజు శివుడికి పరమ విధేయుడు, గొప్ప భక్తుడైన మార్కండేయ ఆ తోటమాలికి మహా మ్రుత్యుంజయ మంత్రం గురించి తెలియజేస్తాడు. అలాగే జ్యేష్ఠ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలని తోటమాలికి సలహా ఇస్తాడు. అలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. అప్పుడు ఆ తోటమాలి ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాడు. ఆ తర్వాత తను అనారోగ్యం నుండి కోలుకుంటాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow