శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 03. ఏకాత్మతామంత్రం - Sri Saraswati Vidya peetham
August 05, 2025
1. యం వైదికా మన్తదృశః పురాణా ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః
వేదాన్తినో ..నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశన్తి|1
భావము : ప్రాచీనకాలమందలి మంత్రద్రష్టలైన ఋషులు, మునులు ఆ పరమేశ్వరుని ఇంద్ర, యమ, మాతరిశ్వాన శబ్దములచేత సూచించిరి. వేదాంతులు మాటలతో వర్ణింపలేని అతనిని 'బ్రహ్మ' శబ్దముచేత సూచించిరి.
2. శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువన్తి।
బుద్ధస్తథా ర్హన్నితి బౌద్ధజైనాఃః సత్ శ్రీ అకాలేతి చ సిద్ధసంతః॥
భావము : శైవులు శివుడని, వైష్ణవులు విష్ణువని, బౌద్ధులు బుద్ధుడని, జైనులు అర్హన్ అనీ, సిక్కులు సత్రీ అకాల్ అని ఆ పరమేశ్వరుని స్తుతించిరి.
3. శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామితి మాతేతి పితేతి భక్త్యా ।
యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః ||
భావము : ఆ జగదీశ్వరుడైన ప్రభువును కొందరు 'శాస్త'యని, కొందరు ప్రకృతియని, కొందరు కుమారస్వామియని, కొందరు 'స్వామి'యని కొందరు తల్లియని, కొందరు తండ్రియని, పిలుస్తూ భక్తితో ప్రార్థించుచుందురు. ఎవరెన్ని విధములుగా పిలిచిననూ ఆ పరమేశ్వరుడు ఒక్కడే. అతడు అద్వితీయుడు. అతనికి సాటి వేరెవ్వరును లేరు.
