శబరిగిరి అయ్యప్పా శంకరుడే మీయప్పా
విశ్వమోహనీదేవి విష్ణువే నీ తల్లి
||శబరి||
స్వాములకే స్వామివైన స్వామి అయ్యప్పాగురువులకే గురువైన గురువాయూరప్పా
||శబరి||
మధురాపురిమాధవునే మరిపిస్తావయ్యాఉడిపి శ్రీకృష్ణునిలా ఉన్నావు కదయ్యా
||శబరి||
కొండలలో నెలకొన్న పంపానది రాయాకొండలకే కొండయైన శబరిగిరి వాసా
||శబరి||
భద్రాచల రామయ్య బంధువు నీకయ్యాపళని మురుగన్నీకు వరుసకు అన్నయ్యా
||శబరి||
