209. శరణంటూ మ్రోగేయి శత కోటి కంఠాలు - Sharanantu mrogeyi shatakoti kantaalu - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

209. శరణంటూ మ్రోగేయి శత కోటి కంఠాలు - Sharanantu mrogeyi shatakoti kantaalu - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
శరణంటూ మ్రోగేయి శత కోటి కంఠాలు
నీ దివ్యనాదాలు నింగినే తాకంగా
స్వామియే శరణం అయ్యప్ప శరణం
||శరణంటూ||
భక్తి సాగర మందు భజన తరంగాలు
నీ సర్వనామాలు ముక్తి తీరాలు
||శరణంటూ||
మాకనుల కాంతివో మామనసు శాంతివో
మాభాగ్యదేవతవో మా ప్రాణ నాథుడవో
నీ యందు అనురక్తి సాధుజనులకు ముక్తి
నీ యందు స్థిర భక్తి దీనజన సంపత్తి
||శరణంటూ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow