210. బంగారు కొండపై రంగైనరూపము - Bangaru kondapai rangaina roopamu - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

210. బంగారు కొండపై రంగైనరూపము - Bangaru kondapai rangaina roopamu - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
బంగారు కొండపై రంగైనరూపము
జ్యోతి స్వరూపము మాకపురూపము
ఈకన్నులే చాలవు నిన్ను చూడ
మాటలే రావు నిన్ను కొనియాడ
|| బంగారు||
చందన ఛాయలో చిందిన రాగాలు
విభూతి రేఖలలో విరజల్లు భోగాలు
చిరునవ్వులొలికించునీమోము
మరియెంత చూసినా మరలి రాలేము
|| బంగారు||
మకర సంక్రాంతిలో జ్యోతిని తిలకించి
ఒడలు పులకించి కనులు ముకుళించి
మనసే కరిగింది మంచువోలె
తనువే విరిసింది తలిరువోలె
|| బంగారు||
గాలిలో నీలీల లీనమై తాకగా
దారిలో విదయ దాదిగా పాకగా
పాపాలు పోయేయి పటాపంచలై
దోషాలు తోలిగేయి తునాతునకలై
|| బంగారు||
నీ భక్తి పాటలే బాటలై నడిపిస్తే 
నీ పాద దాసులే చేయూతనిస్తుంటే 
కులమత భేదాలు కూలిపోవా 
తర తమ తేడాలు తరలి పోవా
|| బంగారు||
నీలాల వలువలు నీ కొండ కప్పగా 
ఇరుముడి మూటలే నీ కొండ నిండగా 
ఈర్ష్యలు స్వార్థాలు ఇగిరిపోవా 
మదమాత్సర్యాలు మాసిపోవా
||బంగారు||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow