208. శబరిగిరి అయ్యప్పా శంకరుడే మీయప్పా - shabarigiri Ayyappa shankarude - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

208. శబరిగిరి అయ్యప్పా శంకరుడే మీయప్పా - shabarigiri Ayyappa shankarude - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

శబరిగిరి అయ్యప్పా శంకరుడే మీయప్పా
విశ్వమోహనీదేవి విష్ణువే నీ తల్లి
||శబరి||
స్వాములకే స్వామివైన స్వామి అయ్యప్పా
గురువులకే గురువైన గురువాయూరప్పా
||శబరి||
మధురాపురిమాధవునే మరిపిస్తావయ్యా
ఉడిపి శ్రీకృష్ణునిలా ఉన్నావు కదయ్యా
||శబరి||
కొండలలో నెలకొన్న పంపానది రాయా
కొండలకే కొండయైన శబరిగిరి వాసా
||శబరి||
భద్రాచల రామయ్య బంధువు నీకయ్యా
పళని మురుగన్నీకు వరుసకు అన్నయ్యా
||శబరి||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow