జ్యోతి స్వరూపము మాకపురూపము
ఈకన్నులే చాలవు నిన్ను చూడ
మాటలే రావు నిన్ను కొనియాడ
|| బంగారు||
చందన ఛాయలో చిందిన రాగాలువిభూతి రేఖలలో విరజల్లు భోగాలు
చిరునవ్వులొలికించునీమోము
మరియెంత చూసినా మరలి రాలేము
|| బంగారు||
మకర సంక్రాంతిలో జ్యోతిని తిలకించిఒడలు పులకించి కనులు ముకుళించి
మనసే కరిగింది మంచువోలె
తనువే విరిసింది తలిరువోలె
|| బంగారు||
గాలిలో నీలీల లీనమై తాకగాదారిలో విదయ దాదిగా పాకగా
పాపాలు పోయేయి పటాపంచలై
దోషాలు తోలిగేయి తునాతునకలై
|| బంగారు||
నీ భక్తి పాటలే బాటలై నడిపిస్తే నీ పాద దాసులే చేయూతనిస్తుంటే
కులమత భేదాలు కూలిపోవా
తర తమ తేడాలు తరలి పోవా
|| బంగారు||
నీలాల వలువలు నీ కొండ కప్పగా ఇరుముడి మూటలే నీ కొండ నిండగా
ఈర్ష్యలు స్వార్థాలు ఇగిరిపోవా
మదమాత్సర్యాలు మాసిపోవా
||బంగారు||
