లక్ష్మి గణపతి వాణీగణపతి దేవా
శుభ పంబాగణపతి డూండి గణపతి నీవే
కాణిపాకమున సిద్ధి గణపతీ (2)
కన్నెమూలగణతి దేవాదిదేవా
||లక్ష్మి||
అయ్యపాగ్రజ ఆదరింపుమా మా దీక్ష సాగనీ నిరతం సాగనీ గిరివరసుతజాతా పురహర సంజాతా
నిన్నే తలచితి నిన్నే పిలిచితి నిన్నే కొలచితి నిన్నే పొగిడితి
నిన్నే తలచితి నిన్నే పిలిచితి నిన్నే కొలచితి నిన్నే పొగిడితి
నిన్నే కోరితి నిన్నే వేడితి వరదా శుభకర సుఖదా
||లక్ష్మి||
మొదలి వేలుపా ముదల నీయరా
పోనీ ఆగ్రహం రానీ అనుగ్రహం
సతజనహిత వరదా సురగణనుతచరణా
విఘ్నాలన్నియు భగ్నం చేయర దుష్టుల చేష్టలు దూరం చేసి
విఘ్నాలన్నియు భగ్నం చేయర దుష్టుల చేష్టలు దూరం చేసి
లగ్నం పెట్టర శుభకార్యాలకు
భజరే గణనాథం భజ భజరే గణనాథం
భజరే గణనాథం భజ భజరే గణనాథం
||లక్ష్మి||