కాశి (వారణాసి) అయ్యప్ప ఆలయం*
*కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్*
అన్నారు పెద్దలు.
కర్మభూమి యగు కాశీ పట్టణమున పాండే హవేలి ప్రాంతమున సోనార్వుర్ అను స్థలము నందలి గల తిలాండేశ్వర్ ఆలయమున శబరిమలై పోలిన అయ్యప్పస్వామి సన్నిధానము ప్రతిష్ఠించబడి చాల కాలముగా త్రికాల పూజా ఆరాధనలు క్రమము తప్పక జరిపించబడుచున్నది. ప్రతిష్ఠ జరిగిన దినము నుండి కేరళ ఆచార ప్రకారం ఇచ్చట పూజలు జరిపించుచున్నట్లుగాను , కాశీ మొదలు రామేశ్వరం వరకు స్వామి అయ్యప్ప పాలనలో గలదు అన్నందులకు నిదర్శనగా అలనాడే ఇటు కాశీయందును , హరిద్వార్ నందును స్వామి అయ్యప్ప విగ్రహములను ప్రతిష్ఠ చేసినట్లు తెలుపుతున్నారు. మనము అనునిత్యం పిలుచుకునే శరణఘోషలో *"కాశీవాసియే శరణమయ్యప్ప"* అని పిలుచుటయే ఇందులకు తార్కాణము. కాశీ నుండి కూడా అశేష భక్తజనులు మాలధరించి విధిగా మండల దీక్ష చేసి , ఇరుముడి కట్టుకొని , శబరిమల యాత్ర వెళ్ళివస్తున్నారనియు ఉత్తరాదివాళ్ళు సైతం ఈ అయ్యప్పదీక్షకు ఆకర్షించబడి మాల ధరిస్తున్నారనియు తెలిపిరి. మనవాళ్ళు ఇటునుండి చాలా మంది భక్తులు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని , విశాలాక్షి దేవిని , అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకుని వస్తుంటారు. ఈసారి కాశీ వెళ్ళే వారు తప్పనిసరిగా తిలాండేశ్వర్ ఆలయంలోని స్వామి అయ్యప్పను దర్శించి తరించాలని ఆశిస్తున్నాము.
