ఉత్తరా నక్షత్ర వ్రత మహిమ*
పాంచాల దేశపు రాజైన వీరదేవునకు సుమతి - లావణ్య అను ఇరువురు భార్యలు గలరు. చిన్నదైన లావణ్య , సవతిపై ఈర్ష్య చెంది , ఆమెను అంతమొందించుటకై వేచియుండినది. ఇంతలో
పట్టమహిషియైన సుమతి ఒక మగబిడ్డను ప్రసవించెను. విధివశమున ఆ బిడ్డ కుష్టురోగిగా జన్మించెను. ఈ సందర్భమును అలుసుగా తీసుకుని , సవతిపై నిందలు మోపి , మహారాజు ఆమెను
అడవులకు పంపునట్లుగా చేసినది.
వేరుదారి తెలియని సుమతి , శాస్తాయందు తనకు గల భక్తియే దీనికి మార్గమునుచూపునని
నమ్మినదై , తన కుమారుడైన జయదేవునితో పలుచోట్ల తిరుగుచూ , పలువురిని సహాయము కోరసాగినది. వేరు మార్గము లేక , తాను ఒక మహారాణి నన్న నిజమును దాచి పెట్టినదై , ఒక
బ్రాహ్మణుని పంచనచేరి పనిమనిషిగా ఊడిగము చేయసాగినది.
ఏండ్లు గడిచినవి. జయదేవుడు యుక్తవయస్కుడయ్యెను. కానీ అతడి వ్యాధి తగ్గు మార్గము
కనిపించనిదయ్యెను. ఒకనాడు బ్రాహ్మణుని గృహమునకు ఏతెంచిన , శాస్తా యొక్క ప్రియభక్తుడైన ఒక
బ్రాహ్మణుడు జయదేవుని చూచి , అతడి తల్లితో శాస్తా యొక్క ఉత్తరానక్షత్ర వ్రత విధానమును
తెలియజేసి , దానిని ఆచరించు విధానమును తెలిపెను.
అతడు చెప్పినట్లే సుమతి ఒక సంవత్సర కాలము వ్రతమును ఆచరించగా , స్వామి యొక్క ఆశీర్వాద బలము వలన అతడి దీర్ఘవ్యాధి గుణమై , అందవికారముగా నున్న అతడి రూపు మారిపోయి , సౌందర్యవంతమైన రూపమును పొందెను.
ఆ దేశము నేలు మహారాజు , తన రాజ్యమున జరిగిన అద్భుతమును విని , తన కుమార్తెను జయదేవునికిచ్చి వివాహము చేయగోరెను.
తల్లియైన సుమతితో సంభాషించు సమయమున , ఆమె విధి వశమున రాజ్యమునకు దూరమైన ఒక మహారాణిగా గుర్తించి , తండ్రియైన పాంచాల దేశపు రాజు యొక్క సమ్మతము కోరెను. చేసిన
ద్రోహమునకు ఫలితముగా , అంతవరకు బిడ్డలు కలుగక బాధపడుచున్న మహారాజు , తన తప్పును మన్నించుమని భార్యను , పుత్రుని క్షమాభిక్ష కోరెను. రాజలాంఛనములతో ఘనముగా అత్యంత
వైభవముగా జయంతునితో , రాకుమారి వివాహము జరిగెను.
ఉత్తరానక్షత్ర వ్రతము మిక్కిలి మహిమాన్వితమైనది. ఇట్టి వ్రతమును అనుసరించియే భీముడు
బకాసురుని సంహరించెను. అర్జునుడు దుర్యోధనాదులను జయించెను. కీర్తి ప్రతిష్టలను ప్రసాదించు
ఈ వ్రతము సకల కార్యములను నెరవేర్చునది.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*