శ్రీ మహాశాస్తా చరితము - 105 |నామసంకీర్తన ఫలితము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 105 |నామసంకీర్తన ఫలితము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

నామసంకీర్తన ఫలితము*

ఒకప్పుడు దక్షిణ భారతదేశమును *'మణిపాలుడను'* రాజ నిరంకుశ పరిపాలన చేయుచుండెను.
అతడు యుద్ధకాంక్ష కలిగినవాడై , దురాశాపరుడై , సదాయుద్ధము చేయుచూ , బలహీనులను ఓడించుచూ , ఎందరో రాజులను సామంతులుగా చేసికొనుచూ , వారి రాజ్యమున గల
ఐశ్వర్యమునంతయూ కొల్లగొట్టుచుండెను.

అట్టి మణిపాలునకు పొరుగురాజ్యమైన మాళవదేశముపై కన్నుపడెను. ఆ దేశమున సుభిక్షము తాండవిచుట చూచి , ఆ దేశముపై దండెత్తెను. మాళవ దేశమును పరిపాలించు *'ఆనందవర్మ'* తన
సేనాధిపతి యొక్క సారధ్యమున సేనను ఎదుర్కొనమని పంపెను. ఆనందవర్మ దైవభక్తి పరుడు , ధార్మికుడు అయి ఉండెను.

సేనాధిపతియైన సత్యవంతుడు స్వామియందు భక్తికలవాడు. సదాసర్వకాలమూ స్వామి యొక్క నామజపమునందే నిమగ్నమై యుండెడివాడు. యుద్ధము సలుపు సమయమునందునూ శాస్తా నామమును జపించువాడు. రాజు ఆజ్ఞను శిరసావహించి , యుద్ధరంగమునకేగిన సత్యవంతుడు సులభముగా శత్రువులను జయించసాగెను. అతడిసేనలు తక్కువే అయిననూ , మణిపాలుని
సేనలను త్వరలోనే ధ్వంసము చేయసాగినవి.

యుద్ధరంగమున సత్యవంతుడు సదా మహాశాస్తా , మహాశాస్తా అంటూ నామస్మరణ చేయుచునే యుద్ధము చేయసాగెను. స్వామి అనుగ్రహము వలన సత్యవంతునకు అమిత పరాక్రమము కలిగి ,
తుదకు మణిపాలుని తుదముట్టించెను.

తరువాత కొన్ని దినములకు మహారాజునకు స్వప్నమునందు ఒక దృశ్యము కనిపించెను.
స్వప్నమునందు యుద్ధ రంగమున జరిగిన విశేషములు కనబడసాగినవి. ఇరు సేనలూ యుద్ధమున
తలపడుటయూ , సేనాధిపతియైన సత్యవంతుడు , సారధ్యము వహించుచూ , శాస్తా యొక్క నామము జపించు సమయమున చనిపోయిన వీరులను దేవలోకమునకు తీసికొనుపోవుటకై దేవగణములు వచ్చుట చూచి నివ్వెరపోయెను. నిరంకుశ పరిపాలన చేసిన మణిపాలుడు సత్యవంతుని చేతిలో
మరణించి , దేవలోకమునకు పోవుటను చూచెను” స్వప్నము చెదిరి , కనులు తెరచి చూచిన మహారాజునకు జరిగినదంతయూ అర్థము కానిదయ్యెను.

దురాశపరుడు , నిరంకుశ పరిపాలకుడై జనులను ఎంతగానో హింసించిన కిరాతకుడు ఎట్లు
సద్గతిని పొందెనను సంశయములో నుండెను.

కొంతకాలమునకు నారదమహర్షి రాజసభకు వచ్చినపుడు మహారాజు తన సందేహమును
వ్యక్తము చేయగా , నారదుడు అతడితో *“మహారాజా ! నీ స్వప్నమునకు ఒక అర్థమున్నది. నీ సేనాధిపతి అయిన సత్యవంతుడు , యుద్ధరంగమున సైతము పరబ్రహ్మ స్వరూపుడైన శాస్తా యొక్క దివ్యనామమును ఉచ్చరించుచూ శత్రువులను ఓడించెను. ఊపిరి పోవు తరుణమున , ఆ స్వామి యొక్క దివ్యనామము చెవులబడిన కారణముగా , చనిపోయిన వారికి సద్గతి కలిగినది. మణిపాలునికి కూడా ఆ విధముగానే సద్గతి లభించినది. అతడి పాపములన్నియూ నశించినవి. ఆ పుణ్యబలము కారణముగానే శాస్తా లోకమును చేరుటకు సాధ్యమైనవి. ఆ స్వామి యొక్క నామమునకు అంతటి మహిమ కలదు”* అని తెల్పెను.

*నామపారాయణ ప్రీతునిగా వెలుగొందు స్వామి యొక్క మహిమను వర్ణించతరమా?*

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow