స్వామి యొక్క నామరూపములు*
స్వామి ఒక్కడే అయిననూ , మనదేశమునందు పలువురు మహాపురుషులకు
పలురూపముగా దర్శనమును ప్రసాదించెను. ఆయా రూపముల కనుగుణముగా
నిర్దేశించబడిన మంత్రములను , ఉపాసనాక్రమమును , ఆ మహాపురుషులు మనకు
తెలియజేసిరి. వీటిని మనము నిర్ధిష్ట మార్గమున అనుష్ఠించినచో ఆయాదేవతల యొక్క
అనుగ్రహమును మనము సైతము పొందుదుము.
*(కంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములు తెలియజేసినది)*
లోకోద్ధరణకుగానూ ఒక రూపమును పూనెను.
ఈ లోకమునందంతయ సర్వవ్యాపియై యున్న శాస్తా , భక్తుల కోరికలను నెరవేర్చు నిమిత్తము
పలురూపములుగా , తత్వమసిగా , వారిని ఉద్ధరించుటకై అవతరించినవాడయ్యెను. ముల్లోకములనూ
పరిపాలించువాడు అగుటచేత , అతడు ఏ అవతారము దాల్చునో , ఆ రూపము సంతరించుకొని , అతడి యొక్క దైవశక్తి , పలువిధములుగా , దైవము యొక్క ఉనికిని మనకు తెలియజేయుచుండెను.
*యోగీనాంచ యతీనాంచ జ్ఞానినాం మంత్రిణా త్వతః*
*ధ్యాన పూజా నిమిత్తాయ నిష్కళం సకలం భవేత్!.*
యోగులు , సన్యాసులు , జ్ఞానులు , మంత్రజ్ఞులు మొదలగువారికై నిర్గుణరూపుడైన భగవంతుడు , సగుణ స్వరూపుడై గోచరించుచున్నాడు. తనను నమ్మినవారికి మంచి చేయుటకై పలు రూపములను
ధరించుచున్నాడు.
ఇది నిరూపణ చేయుటకు భక్తుల యొక్క ఇహపరలోకసాధనకై స్వామి యొక్క రూపములు
పలువిధములుగా గోచరించుచున్నవి. కరుణా సముద్రుడైన శాస్తా యొక్క కారుణ్యము ఎల్లలులేనిది. అందువలననే జ్ఞానులైనవారు తడిసి , మునిగి , తాదాత్మ్యము చెంది ఆ రూపమునకు పలువిధములైన
నామములనిడిరి. పేర్లు , రూపములు వేరువేరైననూ , అన్నిటికీ అతీతుడైనవాడై భాసిల్లునట్టి దైవము
మహాశాస్తా.
సాధారణముగా శాస్తా ఎనిమిది రూపములు గలిగిన ఎనిమిది అవతారములను దాల్చినవాడు అని చెప్పబడుచున్నది. కానీ ఎనిమిది అవతారములే యని నిర్ధారింపవీలుకాకున్నది.
*'ఉపాసనా మార్గదర్శి'* అనుగ్రంధము దీనికి భిన్నముగా వేరు. ఎనిమిది రూపములను
వర్ణించుచున్నది.
కాబట్టి స్వామి యొక్క అవతారములను లెఖించుటకు సాధ్యము కాకున్నది మరియూ *'మహాలక్ష్మీ కల్పము'* అను గ్రంధమున
*మహాశాస్తా , శత్రుశాస్తా , జనశాస్తా , తదైవచ*
*సర్వశాస్తా చ శాస్తా చ ప్రశాస్తా షడ్విధా సమృతాః*
అంటూ , ఆరు రకములుగా వర్ణించబడియున్నది.
1. మహాశాస్తా
2. శత్రుశాస్తా
3. జనశాస్తా
4. సర్వశాస్తా
5. ప్రశాస్తా
6. శాస్తా అని వివరించబడినది.
అంతేకాక పరమేశ్వరుడు ఆనంద నర్తనము చేయు చిదంబర క్షేత్రమున గల అష్టదిక్కుల యందునూ ఎనిమిది రూపములుగా కనబడుచున్నాడు.
*“అష్టా క్షేత్రాణి సంత్యత్ర తేష్వకం క్షేత్రముత్తమం”*
అంటూ వర్ణించునది చిదంబర రహస్యము.
అంతేకాక
మహాశాస్తా *జగన్మోహనశాస్తా బాలస్వరూపకః
కిరాతశాస్తా , శ్రీధర్మశాస్తా వైష్ణవ శాస్తుృకః
బ్రహ్మశాస్తా , రౌద్రశాస్తా , భ్యత్తెశాస్తార ఈరితా
శాస్త్రష్టకం సమారవ్యాతం చిదంబరపురే దిశి||
అంటూ క్రింద చెప్పబడినట్లుగా వరుస క్రమమును సూచించినది. అదేమనగా
1. మహాశాస్తా
2. జగన్మోహనశాస్తా
3. బాలశాస్తా
4. కిరాతశాస్తా
5. ధర్మశాస్తా
6. విష్ణుశాస్తా
7. బ్రహ్మశాస్తా
8. రుద్రశాస్తా
అంటూ ఎనిమిది పేర్లతో , అష్టదిక్కులయందు స్వామి కొలువై యుండి చిదంబర క్షేత్రమును
కాపాడుచుండునట్లుగా వర్ణించినది.
ఇవియే కాక పలు ఆగమగ్రంధములు , స్థలపురాణములు , ధ్యానశ్లోక గ్రంధములు ఇవన్నియూ
స్వామి యొక్క వేర్వేరు అవతార విశేషములను వెల్లడి చేయుచున్నవి. ఈ అవతారములన్నియూ
వీరము , కరుణ , జ్ఞానము అను మూడింటినీ పరిపూర్ణముగా పొందియున్నవి. కాబట్టే కొన్ని రూపములు యోగమూర్తిగానూ , కొన్ని భోగమూర్తిగానూ , మరికొన్ని వీరమూర్తిగానూ భాసిల్లుచున్నవి.
వీటిలో ఆనందమును కోరువారు భోగమూర్తిని , జ్ఞానము , బుద్ధిని కోరువారు యోగమూర్తిని ,
శత్రువులను జయింపగోరువారు వీరమూర్తిని కొలుచుటచే తాము కోరిన కోర్కెలు నెరవేరునని విజ్ఞులవాక్కు
కుడికాలుని క్రిందుగా వ్రేలాడదీయువాడు , వంచబడిన మొనకలిగిన కర్రను , వజ్రాయుధమును
చేతియందు ధరించినవాడు , ఎగురుచున్న పతాకమును గలిగిన గజమును అధిరోహించువాడు ,
గజమును మాత్రమే కాక అశ్వమును , వృషభమును వాహనములుగా కలిగినవాడు, కుక్కుటమును
పతాకము నందు కలిగినవాడు , రూపమున యౌవనవంతుడై జ్ఞానివలె , వేదాధ్యయనము
చేయుస్థితియందుండుచే , హృదయమున ఉపవీతము ధరించియూ మనకు దర్శనమిచ్చుచుండెను.
*పూర్ణా పుష్కలా సమేత శాస్తా*
*యువానం సుందరం సౌమ్యం పుష్ప గుచ్చరం ప్రభుం*
*యోగవేష్టిత దివ్యాంగం సుఖపద్మాసనస్థితం*
*పూర్ణాంచ పుష్కలాం దేవీం కృత్వా దక్షిణవామయో*
*పార్శ్యయోః భ్రాజమానం తం శాస్తారం నౌమిభూతయే||*
(మూర్తి ధ్యానం)
పలురూపముగా దర్శనమును ప్రసాదించెను. ఆయా రూపముల కనుగుణముగా
నిర్దేశించబడిన మంత్రములను , ఉపాసనాక్రమమును , ఆ మహాపురుషులు మనకు
తెలియజేసిరి. వీటిని మనము నిర్ధిష్ట మార్గమున అనుష్ఠించినచో ఆయాదేవతల యొక్క
అనుగ్రహమును మనము సైతము పొందుదుము.
*(కంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములు తెలియజేసినది)*
*స్వామి యొక్క అవతారములు*
పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్ముడు రూపము (నిర్ధిష్టమైన) లేనివాడు. అయిననూలోకోద్ధరణకుగానూ ఒక రూపమును పూనెను.
ఈ లోకమునందంతయ సర్వవ్యాపియై యున్న శాస్తా , భక్తుల కోరికలను నెరవేర్చు నిమిత్తము
పలురూపములుగా , తత్వమసిగా , వారిని ఉద్ధరించుటకై అవతరించినవాడయ్యెను. ముల్లోకములనూ
పరిపాలించువాడు అగుటచేత , అతడు ఏ అవతారము దాల్చునో , ఆ రూపము సంతరించుకొని , అతడి యొక్క దైవశక్తి , పలువిధములుగా , దైవము యొక్క ఉనికిని మనకు తెలియజేయుచుండెను.
*యోగీనాంచ యతీనాంచ జ్ఞానినాం మంత్రిణా త్వతః*
*ధ్యాన పూజా నిమిత్తాయ నిష్కళం సకలం భవేత్!.*
యోగులు , సన్యాసులు , జ్ఞానులు , మంత్రజ్ఞులు మొదలగువారికై నిర్గుణరూపుడైన భగవంతుడు , సగుణ స్వరూపుడై గోచరించుచున్నాడు. తనను నమ్మినవారికి మంచి చేయుటకై పలు రూపములను
ధరించుచున్నాడు.
ఇది నిరూపణ చేయుటకు భక్తుల యొక్క ఇహపరలోకసాధనకై స్వామి యొక్క రూపములు
పలువిధములుగా గోచరించుచున్నవి. కరుణా సముద్రుడైన శాస్తా యొక్క కారుణ్యము ఎల్లలులేనిది. అందువలననే జ్ఞానులైనవారు తడిసి , మునిగి , తాదాత్మ్యము చెంది ఆ రూపమునకు పలువిధములైన
నామములనిడిరి. పేర్లు , రూపములు వేరువేరైననూ , అన్నిటికీ అతీతుడైనవాడై భాసిల్లునట్టి దైవము
మహాశాస్తా.
సాధారణముగా శాస్తా ఎనిమిది రూపములు గలిగిన ఎనిమిది అవతారములను దాల్చినవాడు అని చెప్పబడుచున్నది. కానీ ఎనిమిది అవతారములే యని నిర్ధారింపవీలుకాకున్నది.
*'ఉపాసనా మార్గదర్శి'* అనుగ్రంధము దీనికి భిన్నముగా వేరు. ఎనిమిది రూపములను
వర్ణించుచున్నది.
కాబట్టి స్వామి యొక్క అవతారములను లెఖించుటకు సాధ్యము కాకున్నది మరియూ *'మహాలక్ష్మీ కల్పము'* అను గ్రంధమున
*మహాశాస్తా , శత్రుశాస్తా , జనశాస్తా , తదైవచ*
*సర్వశాస్తా చ శాస్తా చ ప్రశాస్తా షడ్విధా సమృతాః*
అంటూ , ఆరు రకములుగా వర్ణించబడియున్నది.
1. మహాశాస్తా
2. శత్రుశాస్తా
3. జనశాస్తా
4. సర్వశాస్తా
5. ప్రశాస్తా
6. శాస్తా అని వివరించబడినది.
అంతేకాక పరమేశ్వరుడు ఆనంద నర్తనము చేయు చిదంబర క్షేత్రమున గల అష్టదిక్కుల యందునూ ఎనిమిది రూపములుగా కనబడుచున్నాడు.
*“అష్టా క్షేత్రాణి సంత్యత్ర తేష్వకం క్షేత్రముత్తమం”*
అంటూ వర్ణించునది చిదంబర రహస్యము.
అంతేకాక
మహాశాస్తా *జగన్మోహనశాస్తా బాలస్వరూపకః
కిరాతశాస్తా , శ్రీధర్మశాస్తా వైష్ణవ శాస్తుృకః
బ్రహ్మశాస్తా , రౌద్రశాస్తా , భ్యత్తెశాస్తార ఈరితా
శాస్త్రష్టకం సమారవ్యాతం చిదంబరపురే దిశి||
అంటూ క్రింద చెప్పబడినట్లుగా వరుస క్రమమును సూచించినది. అదేమనగా
1. మహాశాస్తా
2. జగన్మోహనశాస్తా
3. బాలశాస్తా
4. కిరాతశాస్తా
5. ధర్మశాస్తా
6. విష్ణుశాస్తా
7. బ్రహ్మశాస్తా
8. రుద్రశాస్తా
అంటూ ఎనిమిది పేర్లతో , అష్టదిక్కులయందు స్వామి కొలువై యుండి చిదంబర క్షేత్రమును
కాపాడుచుండునట్లుగా వర్ణించినది.
ఇవియే కాక పలు ఆగమగ్రంధములు , స్థలపురాణములు , ధ్యానశ్లోక గ్రంధములు ఇవన్నియూ
స్వామి యొక్క వేర్వేరు అవతార విశేషములను వెల్లడి చేయుచున్నవి. ఈ అవతారములన్నియూ
వీరము , కరుణ , జ్ఞానము అను మూడింటినీ పరిపూర్ణముగా పొందియున్నవి. కాబట్టే కొన్ని రూపములు యోగమూర్తిగానూ , కొన్ని భోగమూర్తిగానూ , మరికొన్ని వీరమూర్తిగానూ భాసిల్లుచున్నవి.
వీటిలో ఆనందమును కోరువారు భోగమూర్తిని , జ్ఞానము , బుద్ధిని కోరువారు యోగమూర్తిని ,
శత్రువులను జయింపగోరువారు వీరమూర్తిని కొలుచుటచే తాము కోరిన కోర్కెలు నెరవేరునని విజ్ఞులవాక్కు
*మోహిని పుత్రుడైన శాస్తా*
శాంతస్వరూపుడైన శాస్తాని *'పూర్వకారణ ఆగమము'* ఇట్లు వర్ణించుచున్నది. నల్లని మేని ఛాయ గలిగి , మడిచి యుంచిన ఎడమ కాలిపై , ఎడమ చేయినుంచియూ ,కుడికాలుని క్రిందుగా వ్రేలాడదీయువాడు , వంచబడిన మొనకలిగిన కర్రను , వజ్రాయుధమును