శ్రీ మహాశాస్తా చరితము - 109 | సమ్మోహనశాస్తా | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 109 | సమ్మోహనశాస్తా | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

*సమ్మోహనశాస్తా*


*తేజోమండల మధ్యకం త్రినయనం దివ్యాంబరాలంకృతం*
*దేవం పుష్ప శరేక్షు కార్ముఖ లసత్ మాణిక్య పాత్రాప యాన్*
*బిభ్రాణం కరపంకజైః మదగజ స్కందాది రూఢం*
*మహాశాస్తారం సతతం నమామి వరదం త్రైలోక్య సమ్మోహనం*

(ఆకాశభైరవకల్పం)

తేజో మండల మధ్యముడు , మూడు కన్నులు కలవాడు , అందమైన వస్త్రములను ధరించినవాడు ,
పుష్పమాలిక , చెరకువిల్లును , మాణిక్యపాత్రమును , అభయ ముద్రను చేతులందు ధరించినవాడు ,
మదగజమును అధిరోహించిన వాడు ,
కోరిన కోరికలను నెరవేర్చువాడు , ముల్లోకములను మైమరపించు అందమును కలిగినవాడూ అయిన శాస్తాని ప్రార్థించుచున్నాను.

దీనిని శాస్తా యొక్క రజోగుణము ప్రతిఫలించు ధ్యానముగా పేర్కొనవచ్చును. శ్రీమాతా
లలితేశ్వరిని పోలినట్లుగా పుష్పమాలికను , చెరకువిల్లును బూని సౌందర్యవంతునిగా భాసిల్లు సమ్మోహనశాస్తా , కోరిన కోరికలను నెరవేర్చువాడు. శ్రీదేవికి సమానుడైన ఇతడు మనకు తోడుగా
నిలచువాడు.

*బాలశాస్తా*

*తయోః సంపత్ శాస్తా శ్యామ పర్వత సన్నిభః*
*క్షీర పాత్రం తదత్ బాహ్వోః అభ్యాసేష్ఠించ వీర్యవాన్*

మరకతమేని కలవాడై , కరమునందు క్షీరపాత్ర ధరించినవాడు , వీరునివలె ఛండాయుధమును
చేబట్టినవాడు అని శైవమహాపురాణము బాలశాస్తాని వర్ణించుచున్నది.

*కోమల తనుర్ మరకతో ఫలనికాచో*
*దుక్త చక్షకం కరతలేచ నివహన్ వై*
*మందహాస సుందర ముఖో మమ శివస్య*
*ప్రాదురా భవత్ సకలలోక గణశాస్తా*

మరకతమణివోలె ప్రకాశించుమేని కలవాడు , క్షీరకలశమును చేతియందు ధరించినవాడు ,
చిరుదరహాసము చేయువాడు , శివపుత్రుడూ అయిన , ముల్లోకములనూ కాపాడు దైవమైన ఘనశాస్తా
రూపున ప్రకాశించుచున్నాడు.

ఇతడికి తులసీదళము , నువ్వులనూనె దీపము శ్రేష్ఠమైనది. చేతియందు క్షీరపాత్రను ధరించినవాడైన శాస్తాను , బాలశాస్తాగా కేరళదేశముననున్న రామక్షేత్రమునందు *'తృపయాత్'* అను నామముతో ప్రసిద్ధి చెందిన విధము కాననగును.


*శత్రువిమర్ధన మూర్తి*

*కలారోజ్వల నీల కుంతల భరం కాలాంబుద శ్యామలం*
*కర్పూరా కలితాభి రామ వపుషం కాంతేంతు బింబాననం*
*శ్రీదండాంకుశ పాశ శూల విలసత్ పాణిం మదాంధ ద్విభారూఢం*
*శత్రు విమర్ధనం హృది మహాశాస్తార మాధ్యం భజే.*
ప్రకాశవంతమైన , అందమైన కనుదోయి కలవాడు , నీలమేఘశ్యాముడు , కర్పూరం వంటి
సుగంధ ద్రవ్యములచేత సువాసన గల మేనిగలవాడు , చంద్రవదనమును కలవాడు , పాశాంకుశములను ,
చక్రం , శూలము మొదలగు వాటిని చేతియందు ధరించినవాడు , మదపుటేనును
అధిరోహించియున్నవాడు , శత్రువులను జయించువాడు అయిన శాస్తాని ప్రార్థించుచున్నాను.

ఈ శ్లోకము శాస్తా యొక్క తమోగుణ తత్వమును నిరూపించుచున్నది. శత్రుభయము కలవారు ,
ఉగ్రమూర్తియైయున్న ఈ మూర్తిని శరణు గోరినచో భక్తులకు శత్రుభయము లేకుండునట్లు చేయునని పెద్దలవాక్కు.

*అశ్వారూఢశాస్తా*

*ఆరూఢ ప్రొడవేగః ప్రవిజిత పవనం తుంగ తుంగం తురంగం*
*చేలం నీలం వశాన కరతల విలసత్ కాండ కోదండ దండః*
*రాగద్వేషాది నానావిధ మృగపటలీ భీతికృత్ భూత పర్దా*
*సర్వన్నాకేట లీలాం పరిలసతు మనః కాననే మామకీనే||*

వాయుదేవుని కన్ననూ అతి వేగవంతమైన వేగము గల అశ్వమును అధిరోహించి ,
నీలాంబరధరునిగా , చేత కోదండము పూని , రాగద్వేషములు అను మృగములకు భీతి కొల్పు
విధముగా ఉండు భూతనాధుడు , నా యొక్క మనస్సు అనే కారడవి యందు తన వేటను , కొనసాగించువాడై ఆనందించును.

ఈ క్రింది శ్లోకము , కైలాసము నందు జరుగు ఉత్సవ వైభవమును శ్రీ ఆదిశంకర భగవత్పాదులచే వర్ణింపబడినది.

*అశ్వం సమారుహ్య వనే చరంతం*
*కోదండ నారాస ధరం కరాభ్యాం*
*శాస్తారం అత్యద్భుత భూతనాధం*
*ధ్యాయేత్ సువీరం సుకుమారం.*

విల్లంబులు చేతబూని , అశ్వమును అధిరోహించి , అడవుల యందు సంచరించుచూ , అత్యద్భుత రూపవంతుడై , ప్రాణకోటిని సంరక్షించు శుద్ధవీరునిగా విలసిల్లు శాస్తాని ద్యానించుదుముగాక.

*శ్రీ సోమేశాత్మ పుత్రం శ్రుతజన వరదం శ్లాఘీనీయా పతానం*
*కేశోత్ భాంతి ప్రణాశం క్లితరిపుశయం కేశసంకాశగాత్రం*
*కోశేచ్చాశ్వాధిరూఢం పరిగత మృగమా కేలానంద చిత్తం*
*పాశోశ్ఛండాస్త్ర పాణిం వరదం అభయదం తోమి వాస్తారమీశం*

*(స్కాందం-సవర్ణ సహస్రనామ ధ్యానం)*

సోమశేఖరుని పుత్రుడు , భక్తులకు అభయము నొసగువాడు , మాయను తొలగించువాడు, ,
శత్రువులను జయించువాడు , మనశ్శాంతిని ప్రసాదించువాడు , ఐశ్వర్యవంతముగా ప్రకాశించు అశ్వమును అధిరోహించినవాడు , వేటయందు ప్రీతికలిగినవాడు , పాశము , ఛండాయుధము , వరద
అభయముద్రలను తన చేతియందు ధరించినవాడు అయిన శ్రీ శాస్తాకి సమస్కారము చేయుచున్నాను.

ఇతడిని సంధ్యాకాలమునందు పూజించుట శ్రేష్ఠము. మనము చేయు ప్రతిపనియందునూ ,
ముఖ్యముగా రాచకార్యములు జయప్రదమగుటకు అశ్వారూఢునిగా గుర్రమును అధిరోహించి
ఊరేగియున్న శాస్తాని కొలువవలెను. తిరుచ్చూరు సమీపముగల *కుదిరాన్' అను స్థలమునందునూ , తిరుచ్చూరు నగరమునగల 'అయనిక్కాడు' అను స్థలమున వీరశాస్తా రూపమును చూడగలము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow