*కిరాత శాస్తా**
కాళాంబోద కలాయ కోమలతనుం ఫాలేందుచూడం విభుం*
*బాలార్కాయుధ రోచిష కర లసత్ కోదండ బాణాంచితం*
*వీరశ్రీ రమణం రమణోత్ సుకమిష రక్తాంబు భూషాంజలీం*
*కాలారి సీతం కిరాత వవుషం వండే పరదైవతం.*
అందమైన శరీరమును గలవాడు , నెలవంకను ధరించినవాడు , అంతటా వ్యాపించి యుండువాడు ,
ఉదయసూర్యునివలె ప్రకాశించు విల్లంబులు ధరించినవాడు , విజయలక్ష్మీనాధుడు , వేటవలన రక్తసిక్తుడైనవాడు , కాలారియైన శివపుత్రుడు అయిన కిరాతరూపమున నున్న భగవంతుని
ప్రార్థించుచున్నాను.
*కోదండం శచరం భుజేన భుజగేంద్ర భోగపాశావహన్*
*వామేన చురికాం విపక్ష దళేన భక్షేన దక్షేణచ*
*కాంత్యా నిర్జితః పురపితః క్రీడన్ కిరాతాకృతే*
*పుత్రోస్మాక మనల్ప నిర్మలయశా నిర్మాతు శర్మాణిశం.*
ఆదిశేషుని కాంతిని పోలిన విల్లంబులను ఎడమచేతియందు , శత్రువులను నిర్మూలించుటయందు
ఉపయోగించు ఛురికను కుడిచేతియందు ధరించి , నీలిమేఘవర్ణము కలవాడై , కీర్తి ప్రతిష్టలతో
అలరారువాడు , అమితవేగము కలవాడు , వేటగాని రూపును ధరించినవాడు , త్రిపురమును భిస్మీపటలము చేసిన వాడైన శివునకు పుత్రుడు అయి భాసిల్లునట్టి *శ్రీ కిరాత శాస్తా* మాకు సుఖసంతోషములను
ప్రసాదించుగాక.
*ప్రత్యర్థి వ్రాత వక్షస్థల రుధిర సురాపాన మత్తం భృషత్కం*
*చాపే సంధాయతిష్టన్ హృదయ సరజిజే మామకే తాప హంతా*
*పింఛీతంసః శరణ్యః పశుపతి తనయో నీ రదాపః ప్రసన్నో*
*దేవః పాయాత్ అపాయా శ్శబర వపురసేన సాధానః సదామాం*
వేటగాని వేషము ధరించినవాడు , శత్రువుల యొక్క హృదయమును చీల్చి చెండాడి , అందుండి స్రవించు రక్త ధారలను మధుపానము వలె సేవించువాడు.
విల్లంబులు పూనినవాడు , నెమలిపింఛమును శిఖయందు ధరించినవాడు , భక్తులమదిలో సదా
కొలువై యుండువాడు , కారుమేఘము వంటి కాంతి గలిగి ఆనందముగా వీక్షించి యుండువాడు ,
పశుపతి యొక్క కుమారుడైన ఓ కిరాతశాస్తా ! నన్ను ఆపదలనుండి సదా రక్షించి ఆశీర్వదింతువుగాక.
స్వామి ధరించిన ఉగ్రరూపములన్నిటియందునూ , వేటగాని వేషమున నున్న ఈ కిరాతశాస్తా రూపము మిక్కిలి ప్రసిద్ధి చెందినది. కాశీనగరపు రాకుమార్తె అయిన ప్రభాదేవిని పరిణయమాడుటకై ఈ వేషమును ధరించి యుండెను. కిరాతసూను అను మరొక స్వరూపుడు కూడా కలడు. కిరాతశాస్తాని ప్రశంశించు *'కిరాతాష్టకము'* అను అద్భుతమైన స్తుతి , రుద్రమునకు సమమైనటువంటిది.
*మంత్రశాస్తా*
*త్రిగుణిత మణి పద్మం వజ్ర మాణిక్యం దండం*
*సితసుమ శరపాశం ఇక్షుకోదండ కాండం*
*మధుకృత మధు పాత్రం బిభ్రతం హస్తపద్మః*
*హరి హర సుత మీథే చక్ర మంత్రాత్మ మూర్తిం*.
సత్వ , రజస్ , తమో గుణములను మూడు గుణముల కలయికయై మాణిక్యము వలె ప్రకాశించు తామరపూవును , వజ్రమాణిక్య దండమును , పుష్పమాలికను , పాశము , చెరకువిల్లు. మధుపాత్రను
చేత ధరించినవాడు శ్రీచక్రమంత్రమునందు భాసిల్లువాడు అయిన హరిహరసుతుని పూజించుచున్నాను.
*లక్ష్మీశాస్తా*
*ఏకాశ్యం ద్వినేత్రంచ స్వర్ణవర్ణం వరప్రదం*
*సింహాసనస్థితం దేవం దశబాహుభిః సుశోభితం*
*శరచ్చక్రం పద్మం ఖడ్గం అభయం దక్షిణేత్రుతం*
*శంఖం ధనుః కేటయో పాత్రం వరదం ద్రుత కరాంబుజం*
*స్వర్ణయజ్ఞోప వీతాంగం లక్ష్మీరూప ప్రభాకరం*
*దారిద్ర్య దుఃఖ నాశనాశ్యం ధ్యాయేత్సుశక్త్యాంశ దైవతం.*
అందమైన వర్చస్సును , నేత్రములు రెండునూ స్వర్ణవర్ణమున ప్రకాశించునట్టియూ , ఉండి వరమును ప్రసాదించువాడు , అందమైన సింహాసనము నందు అమరియున్నవాడు , శరము , చక్రము , తామరపూవును , ఖడ్గము మొదలగు ఆయుధములతో పాటు అభయములను పూనిన ఐదు చేతులను , ఎడమభాగముననూ , శంఖము , విల్లు , డాలు , పాత్రము , వరదము అను వాటిని కుడిభాగముననూ ఉన్న కరముల యందు ధరించినవాడు స్వర్ణమయమైన యజ్ఞోపవీతమును ధరించినవాడు , లక్ష్మీదేవి వలె , ప్రకాశించుచూ భక్తుల దారిద్ర్యమును , దుఃఖమును నాశముచేయగల
శక్తి అంశను పొందిన శాస్తాని ధ్యానించుచున్నాను.
ఇతడు పార్వతీదేవి యొక్క అంశను పొందినవాడు. భక్తుల యొక్క దుఃఖమును తొలగించి , ఐశ్వర్యమును , సుభిక్షమును ప్రసాదించువాడు.
*మరికొన్ని ధ్యాన శ్లోకములు*
*ఆ బ్రహ్మ భ్రూణ పర్యంత పాశేభ్యాం బృహత్తమం*
*పూర్వాది దిశాబాజి ధిక్కజేభ్యో మహోత్త మం*
*వీతగామి తమత్యా కాలసుమా వివర్జితం*
*బ్రహ్మం పరం భూత నాధం ధ్యాయేత్ నీలాంబరం*
బ్రహ్మ మొదలుకొని గర్భమునందుండు శిశువు వరకూ సర్వజనులనూ కాపాడువాడు. పశ్చిమ
దిక్కులను పరిపాలించు గజములకు నాయకుడైనట్టివాడు. కాలాతీతుడైనవాడు , నీలవేమును ధరించిన
భూతనాధుని ధ్యానించుచున్నాను.
*సోయం శూల సుదర్శనాసి డమరున్ భిభ్రత్ జగత్ రక్షకః*
*ధేయాన్ మాధవ శంకర ప్రియసుతః శ్రేయాంసి భూయాంసినః*
కత్తి , శూలము , సుదర్శనము , ఢమరకము అను నాలుగు ఆయుధములను నాలుగు చేతుల యందు ధరించినవాడు , మాధవునకు శంకరునకు ప్రియపుత్రుడై , అఖిలలోకములను కాపాడువానిని
ధ్యానించుచున్నాను.
*అరి సరోరూప శంఖదాధరం పరిఘముద్గర బాణధనుర్ధరం*
*ఛురికతోమర శక్తిలసత్ కరం హరిహరాత్మజమీశ్వర
మాశ్రయే*