శంఖుకర్ణాదుల వధ :
రాక్షస కులమువారందరూ దైవమునకు శత్రువులు కారు. దైవమునకు ఎవరితోనూ శత్రుత్వము
లేదు. శత్రువులు లేరు. తపస్సులకు , పూజలకు మెచ్చి వారు కోరిన వరములను ప్రసాదించటయే దైవము యొక్క ముఖ్య ఉద్దేశము. అట్లు దైవముచే వరమును పొందినవారు గొప్పవారు అనుటలో
అతిశయోక్తి లేదు. అటువంటి గొప్పవారు , మంచి ఉన్నత స్వభావులైయుండి వారిని ఎవరైననూ బాధించునపుడు ధర్మరక్షణకై భగవంతుడు తోడుగా వచ్చును. ఇది నిజము.
ఒకప్పుడు *'శంభుకర్ణుడు'* అను రాక్షసుడు ఉండెను. తలకి నాలుగు కొమ్ములు కలిగియుండి ,
భారీ శరీరము కలిగి చూచుటకే జుగుస్న కలిగించునట్లు ఉండెను. అతడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినచో , కరుణించి వరములను ప్రసాదించును కదా అనుకుని బ్రహ్మదేవుడు కొలువై యుండు ఒకే ఒక క్షేత్రమైన *'పుష్కరము'న* కఠోర తపస్సు చేసి , బ్రహ్మదేవుని అనుగ్రహము వలన అనేక వరములను పొందెను.
సహజముగానే దుష్టస్వభావియైన శంఖు కర్ణునికి , వర బలము తోడైనది. ఇంతేకాక తాళజంగుడు ,
హస్తికర్ణుడు , మహాకాయుడు , మహాబాణుడు , మహోదరుడు , ఉల్కాముఖుడు , భూతివక్రుడు అను
పలువురు రాక్షసులు కూడా తోడైనారు. వీరందరూ సాధుస్వభావుల నెందరినో పలు విధములుగా
బాధించసాగిరి. వీరిని ఎదిరించగల ధైర్యము ఎవరికినీ లేకపోయినది. వీరంతా కలసికట్టుగా
ఒకసారి చంపకారణ్యముణకు వచ్చిచేరిరి. సంపెంగ వృక్షములతో నిండియున్న ఆ అరణ్యమునందు
ఎందరో మునిపుంగవులు , సాధుజనులు నివసించుట చూచిన శంఖుకర్ణునికి దుర్మార్గపు ఆలోచనలు కలిగినవి. వారిని అతిక్రూరముగా బాధింపసాగెను. తన పరివారముతో అచటనే బసచేసెను ప్రశాంతముగా తపమాచరించు నిమిత్తమై వచ్చిన మునులకు ప్రశాంతత కరువాయెను.
ఇట్టి సమయమున *'ఉగ్రతపస్సు'* నామధేయుడైన దేవలోకవిప్రుడు తన శిష్యగణములతో
అచటికి వచ్చి చేరెను. అతడిని చూచుటతో కొంత నెమ్మది చేకూరిన మునులు , అతడికి ,
పరివారమునకు తగిన సత్కారములను చేసిన పిమ్మట రాక్షసులు చేయు దుర్మార్గములను వివరించిరి.
అంతయూ విన్న *'ఉగ్రతపస్సు'* వారిని ఓదార్చి ఇట్లు పలికెను.
*“ఋషిపుంగవులారా ! మీ బాధలను తొలగించుట కొరకే , భగవదనుగ్రహము పొందిన నేను ఇచటికి వచ్చితిని. రాక్షసులనణచి , మంచివారిని కాపాడు ప్రత్యక్షదైవమైన హరిహరపుత్రుడుండగా , మనకేల బాధ ?”* అంటూ వారిని ఓదార్చెను.
తరువాత స్వామికి అత్యంత ప్రియమైన దైన తామ్రపర్ణి తీర్థమును చేరి , స్నానమాచరించి ,
కర్మానుష్టానములను ముగించిన పిమ్మట , హరిశిలా అను స్థలమును చేరి , అచట స్వామిని గూర్చి తపస్సు చేయసాగెను. అతడి తపస్సునకు మెచ్చి , స్వామి సర్వాయుధపాణిగా , తన పరివారముతో అతడి ఎదుట ప్రత్యక్షమయ్యెను. స్వామిని చూచిన ఆనందమున నోట మాటరాక యుండెను.
స్వామిని ఏమి కోరిక కోరుకొనవలెనో తెలియని అయోమయ అవస్థలో ఉండెను. అయిననూ
భక్తుల మనస్సులోని కోరిక భగవంతునికి తెలియకుండునా ? ఆ మాట నిజమన్నట్లుగా శాస్త్ర అతడినుద్దేశించి *"మునివర్యా నీ మనస్సులోని కోరికనుగ్రహించితిని. ఇతరుల మేలు కొరకు నీవు పొందు ఆరాటమును గమనించితిని. నీ మనస్సులోని కోరిక నాకు తెలియనది కాదు. సాధుజనులను బాధించు రాక్షసులను హతమార్చుదును. నీవు భయపడవలసిన పనిలేదు”* అని అంతర్ధానమందెను.
పిమ్మట తన ప్రధాన గణనాధుడైన భూతనాధుని పిలపించెను. భూతనాధుడు వజ్రకాయుడు ,
గణేశ్వరుడు , శషకుడు , మేఘవర్ణుడు , సర్పదంష్ట్రుడు మొదలగు పరివారముతో అచట ప్రత్యక్షమాయెను.
వారిని ఉద్దేశించి స్వామి ఇట్లనెను *“మీరంతా తక్షణమే వెడలి , అరణ్యమున నున్న రాక్షసులను , వారి పరివారములను హతమార్చుదురుగాక అని ఆనతినిచ్చెను. మరుక్షణమే భూతగణములు స్వామి ఆనతి ప్రకారము రాక్షసులతో యుద్ధమొనరించి వారిని , వారి పరివారమును వధించి నిర్మూలించిరి.*
శ్రీ భూతనాధుడు . శంఖుకర్ణుని కంఠమును తాడుతో లాగి వైచుచూ , తన చేత నున్న గదతో
హతమార్చెను. తాళజంగుడు మొదలగు రాక్షసులను భుశుండి యను ఆయుధముచే చంపివైచెను. భూతనాధుని పరాక్రమ ధాటికి తట్టుకొనలేని రాక్షససేన నోటి వెంట రక్తము కక్కుకుంటూ
మరణించిరి. శంఖుకర్ణుడు మొదలగు రాక్షసులను స్వామి ఆనతి ప్రకారము సంహరించిన విషయమును స్వామికి విన్నవించిరి.
*మునివర్యులను ఉద్దేశించి స్వామివారితో*
*“స్వస్తా భవత విజ్వరా:*
*అహమత్ర వశిష్యాది యా* *వదా భూత సంప్లవం”*
*ఇకపై మీరు ప్రశాంతగా జీవనము చేయగలరు. నేను కూడా ఇచటనే కొలువై యుండి మీకు తోడుగా నిలుతును”* అని వక్కాణించెను. అట్లు శాస్తా మధ్యారణ్యేశ్వరుడు (లేక) నడుక్కావుడైయార్
అను పేర్లతో పిలువబడుతూ , తన వద్దకు వచ్చు భక్తుల కోరికలను అనవరతమూ నెరవూర్చుచూ పాలింపసాగెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*