శ్రీ మహాశాస్తా చరితము - 88 | చేమంతి పువ్వు యొక్క మహిమ | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 88 | చేమంతి పువ్వు యొక్క మహిమ | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

చేమంతి పువ్వు యొక్క మహిమ*

దక్షిణ దేశమున నాగపురము అను ప్రదేశమునందు విశ్వనాథుడు అను వ్యాపారి
నివసించుచుండెను. అతడికొక కుమార్తె జన్మించెను. ఆమె జన్మతః వికలాంగురాలై ఉండెను.
అభాగ్యురాలైన ఆమె త్వరలో తన తల్లిని కూడా కోల్పోవలసి వచ్చెను. ఆవణికుడు మరొక యువతిని వివాహమాడెను. కాలము కలసి రాకపోగా , వ్యాపారములో అతడికి విపరీతమైన నష్టము సంభవించెను. కొంతకాలము గడచిన పిమ్మట , అతడు కూడా దివంగతుడయ్యెను. అతడి చిన్నభార్య తన
సవతికుమార్తెను నిరంతరము ఆరళ్లు పెట్టుచుండెను. తాను మాత్రము ఇంటిలో సుఖముగా
కూర్చుండి , సవతి కుమార్తెను తోటలో చేమంతులను కోసి , వాటిని తీసికొని వెళ్లి అమ్ముకొని ధనమును తెమ్మని పంపించుచుండెను.

ఒకరోజు , ఉత్తర నక్షత్రమునందు , ఆ నగరములోని శాస్తా ఆలయములో అగస్త్యుడి యొక్క అధ్యక్షతలో పలువురు వైదీకులు యజ్ఞారాధనమును గావించుచుండిరి.

వ్యాపారి యొక్క కుమార్తె ఆ ఆలయ ప్రవేశ ముఖ ద్వారమునందు కూర్చుని చేమంతి పువ్వులను
అమ్ముచుండెను.

అనుకోని విధమున , ఆ తరుణమునందు , విపరీతమైన గాలులతో కుంభవృష్టికురిసెను. గాలి
తాకిడికి పైకి విసరివేయబడిన చేమంతి పువ్వులు మందిరములో పూజలనందుకొనుచున్న శాస్తామీద పడినవి.

ఆ యువతి పువ్వులట్లు చెల్లాచెదరైన సంభవమును , ధనము లేక ఇంటికేగినచో సవతితల్లి పెట్టు
సణుగుళ్లను గూర్చి చింతిల్లుచుండెను. చేయునది లేక , గాలివాన ఆగిపోయిన వెంటనే ఆయువతి ఇంటిదారిన నడచుచుడెను. తుఫానుగాలికి ఒక వృక్షము వేర్లు తెగిపడగా , ఆమె మీద ఒరిగిపడెను.
తక్షణమే ఆమె యసువులు అనంత వాయువులో లీనమయ్యెను.

అకస్మాత్తుగా సంభవించిన ఆ విపత్తును చూచి అందరు విభ్రాంతులైరి. ఆసమయమున ,
వారందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండగా , ఒక దేవ విమానమచ్చటికి వచ్చి , ఆ యువతి దివ్య
శరీరమును వాయుమార్గమున గైకొనిపోయెను.

ఆవింతకు అందరూ మరింత విస్మయులై , అందులకు కారణమేమి అని అగస్త్యుడిని ప్రశ్నించిరి. అందులకాముని *'ఆయువతి చేత నుండిన చేమంతులు నేరుగా వెళ్లి కుంభములో ఆవాహనము గావింపబడి యున్న శాస్తా మీద పడినవి. తన్మూలమున శాస్తా యొక్క అనుగ్రహము ఆవనితకు లభించెను. అని చేమంతి పువ్వుల మహిమను కొనియాడెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow