శ్రీ మహాశాస్తా చరితము - 90 | విజయుడను బ్రాహ్మణ భక్తుడు శాస్తా విశ్వరూపమును సందర్శించుట | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 90 | విజయుడను బ్రాహ్మణ భక్తుడు శాస్తా విశ్వరూపమును సందర్శించుట | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

విజయుడను బ్రాహ్మణ భక్తుడు శాస్తా విశ్వరూపమును సందర్శించుట*

జగన్మాత శ్రీమీనాక్షీదేవి పాండ్యదేశమును పరిపాలించుచున్న కాలమున , శాస్తామీద అపరిమితమైన
శ్రద్ధాభక్తులు గలిగిన విజయుడను బ్రాహ్మణ కులజుడు వసించుచుండెను. అతడు సకల భోగభాగ్యములతో తులతూగచూ అనుదినమూ శాస్తాను ఆరాధించుచుండెను. వివాహవంతుడై
గృహస్థ ధర్మమును , సక్రమముగా నిర్వహించుచుండెను. తనకు సమస్త సంపదలు సమకూరి యున్నప్పటికి తమకు తదనంతరము దానధర్మాది కార్యములను నెరవేర్చుటకు సంతానము
లేదుకదా అనుచింత సర్వదా అతడిని బాధించుచుండెను.

పుత్రుడు - అనగా , 'పుత్' అను నరకము నుండి తండ్రిని రక్షించువాడు , కనుక పుత్రసంతానమును
బడయుటకొరకై అనేక దానములను , ధర్మకార్యములను తీర్థయాత్రలనను చేయుచుండెను. ఎన్ని
పుణ్యకార్యములు గావించినప్పటికినీ , అతడి మనోవ్యథ తీరకుండెను. అతడు పూర్వము గావించియున్న
సత్కర్మల సత్ఫలముగా , ఒకనాడొక సన్యాసి బ్రాహ్మణ గృహమునకు విజయముచేసెను.

అతడిని ఆదరభావముతో ఆహ్వానించి , వినయపూర్వకముగా నమస్కృతుల నర్పించి , అతడు గావించిన అతిథిసత్కారమునకు సంతసించినవాడై , ఆ సన్యాసి విజయుడి కోరిక తీరగల దారిని చూపెను.

*'బ్రాహ్మణవర్యా ! పుత్రసంతనము లేదని దిగులు చెందవలదు నీకోరిక త్వరలో నెరవేరగలమార్గమును తెలిపెదను. దయానిధియైన అయ్యప్పస్వామి యొక్క తారక మంత్రమును నీకు ఉపదేశింతును. ఆ మంత్రమును అనునిత్యము నిష్ఠతో జపించుము. దక్షిణ దిశాభిముఖముగా పయనించుము. దక్షిణ భాగీరథిగా పేరొందిన పంపానదీ తీరమును చేరుకొనుము. ఆపుణ్య నదీజలములలో స్నానమాచరించి , అచ్చటి నుండి బయలుదేరి అయ్యప్పస్వామి అనుగ్రహమునకు పాత్రురాలైన శబరి అను కరుణామయిని దర్శింపుము. ఆ నదీ మాత నీకు దారి చూపించును. అని తెలిపి , ఆ వైదికుడికి వేదాధినాయకుడైన శాస్తా మూలమంత్రమును ఉపదేశించెను.*

సన్యాసి యొక్క ఆదేశనుసారము వర్తించి , విజయుడు పంపానదీ తీరమును చేరుకొనెను.
పవిత్ర నదీజలములో , స్నానము చేసి పునీతుడై ధ్యానము నందు నిమగ్నురాలైయున్న మహాతపస్విని యుగు శబరీమాతను దర్శించెను. సత్యస్వరూపిణియైన శబరి విజయుడికి మార్గమును చూపించెను.
అచ్చటి నుండి నేరుగా ఉత్తర దిశాభిముఖముగా పయనించుమనియు దేవతలు అయ్యప్పను పూజించుట కొరకై సృష్టింపబడిన దేవగంగా జలపాతమువలె ప్రవహించు ప్రదేశమునకు
చేరుకొనగలవనియు తెలిపెను. ఆకాశగంగా ప్రవాహవేగమునకు అతడు నిలువజాలడని యెంచి , అతడి చేతికొక కుంభము నిచ్చిపంపెను. విజయుడు ఆ తపస్విని పలుకుల ననుసరించి , అయ్యప్ప మంత్రమును స్మరించుకొనుచు పయనించి జలపాతమును సందర్శించెను. దానికెదురుగా కుంభమును చూపెను. ఆ ప్రవాహవేగమునకు తట్టుకొనజాలక కుంభము పగిలి క్రిందపడెను. ఆకుంభము పడిన
స్థలములో లోతుగా ఒకగుంట ఏర్పడి అదొక సరస్సుగా రూపొందెను. భూలోకవాసులను పునీతులుగా చేయుటకొరకై అది ప్రవహింపసాగెను.

విజయుడు మనీశ్వరుడు తనకు ఉపదేశించిన అయ్యప్ప మూలమంత్రమును జపించుకొనుచు
ఆనదిలో మునకలు వేసెను. అతడు గావించిన పాపములన్నియు పటాపంచలయ్యెను. అవి
పక్షుల రూపమును ధరించి పైకెగిరి దూరముగా పోయినవి. ఆకాశమార్గమున ఎగిరి యెగిరి , తరువాత అవన్నియు ఒక్కసారిగా వచ్చి విజయుడి ముందుపడి ప్రాణములు గోల్పోయెను.

విజయుడి మనస్సంతయు అయ్యప్ప మీదనే కేంద్రీకృతమై ఉండెను. అతడి భక్తి తత్పరతకు అయ్యప్ప సంప్రీతి నొందెను. ఒక సుందర బాలకుడి రూపమును దాల్చి , అతడి యెదుట నిల్చెను.

అతడు ఒక చేత ధనుస్సు , మరొక చేత శరములు దాల్చి యుండెను. కాలికి పెండేరము గానవచ్చెను. కాళ్లకు గజ్జెలు ధరించియుండెను. అభయహస్తముద్రను దాల్చి , మందహాసమొలికించుచు
బ్రాహ్మణుడిని చేరబిలిచెను. ఎంతగా పుణ్యకార్యములను గావించినప్పటికి భగవానుడి రూపమును
దర్శించుటకు మననేత్రములు నోచుకొన జాలవు కదా ! కానీ , అట్టి అరుదైన భాగ్యము విజయుడికి లభించెను. బాలుడి రూపములో తన యెదుట నిలబడియున్న అయ్యప్పను దర్శించి , తన అదృష్టసంపదకు సంతోషముతో ఉప్పొంగిపోయెను. వేదసారమై వెలయుచున్న స్వామి పాదపద్మముల
మీద వ్రాలిన విజయుడిని గాంచి స్వామి , *“విజయా ! నీ ఇష్టాభీష్టమేమో తెలియజేయుము”* అని
ప్రేమ పూర్వకముగా అడిగెను.

తన భక్తికి మెచ్చి , దయతో బాలకుడి రూపములో అచ్చటికి విచ్చేసిన భగవానుడిని కన్నులారా దర్శించుచు , విజయుడు తన కోరికను వెల్లడించుటకు సంసిద్ధుడయ్యెను. సంతాన భాగ్యమును
వరముగా ప్రసాదించుమని కోరుకొనదలచెను. అంతలో, అతడి మనసు మారెను. అతడికి బాలకుడి రూపములో వచ్చిన భగవానుడి మీద మమకారము అతిశయించెను. అతడినే తన కుమారుడిగా కోరుకొనెను.

కరుణా సింధువైన శాస్తా విజయుడు కోరిన వరమును అనుగ్రహించుటకు అంగీకరించెను. అతడితో నిట్లనిపలికెను. *“విజయా ! నీవు కోరిన వరమును మరుజన్మమున పొందగలవు. జన్మలో మాత్రము , ముందు నీవు తలచియున్న విధముగా వంశోద్దారకుడైన ఒక సత్పుత్రుని బడయుదువుగాక.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow