వరమును పొందిన బలాన్విత యైన రక్కసి*
మహిషుడు చండిక చేత సంహరింపబడిన విషయము నెరిగిన అతడి సహోదరి కరంబిక
యొక్క దుఃఖమునకు అంతులేకుండెను.
తన పరాక్రమ ప్రభావము వలన త్రిలోకములను శాసించిన సహోదరుని మరణమునకు
ప్రధానకారకులు దేవతలన్న విషయమును తెలిసికొని , వారిపై విపరీతమైన ద్వేషభావమును
పెంచుకొనెను. కన్నతండ్రికి , ప్రియసహోదరుడిని శాశ్వతముగా దూరము గావించిన దేవతలను
ఎట్లయినను జయించి దీరవలయుననియు , అమరావతీ పట్టణమును చేపట్టవలయుననియు కంకణము కట్టుకొనెను. తమ కులగురువగు శుక్రాచార్యుల యొక్క ఆదేశానుగుణముగా , వనమున కేగి , అచ్చట
బ్రహ్మదేవుడి అనుగ్రహము కోరి ఘోరతపము నాచించెను.
నిశ్చలమైన ఆమె భక్తికి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై , ఎదుట సాక్షాత్కరించెను. ఆమెకు ప్రియమైన
వరము నడుగుమని ఆదేశించెను. మృత్యువు తన చెంత చేరకుండునట్లుగా వరమునొసగుమని ఆమె
కోరెను. సృష్టిలో పుట్టిన ప్రాణులన్నిటికిని మరణమనునది తప్పనిసరి , కనుక ఏవిధమైన మరణము
నీకు లభించవలయునో దానిని కోరుకొమ్మని బ్రహ్మదేవుడు సెలవిచ్చెను.
మహిషి కోరిన వరములివి మొదటిది , పంచభూతముల వలన గానీ , ఎట్టిరోగ కారణమువలన
గానీ నాకు మరణమనునది సంభవింపరాదు. రెండవది , నేను తలచినంత మాత్రమున , నా శరీరములోని రోమకూపముల నుండి మహిష సేనలు అసంఖ్యాకములై వెలువవలయును. దేవతలను అణచివేయగల శక్తి యుక్తులను , దేవసేనలకు నాయకురాలిని కాగలిగిన అర్హతను నాకు
దయచేయవలయును. చివరిది , బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల శక్తులన్నిు ఒక్కటిగా కూడి తత్
కారణము చేత ఉద్భవించిన ఒక మహోన్నత శక్తి వలన మాత్రమే నాకు వినాశమనునది
సంభవింపవలయును అని తన యొక్క విజయమును నిరోధించుటకు ఏశక్తి వలననూ వీలుకాని
విధముగా , తనకు అన్న మార్గములు అనుకూలముగా సహకరించు రీతి వరముల నొసగుమని
వేడుకొనెను.
బ్రహ్మదేవుడి అనుగ్రహము చేత దివ్యవరములను పొందిన మహిషి తన దేహమునందుగల
రోమముల నుండి సహస్రసంఖ్యలో రాక్షససేనలను సృష్టించెను. తన సహోదరుడి వధకు కారణమైన దేవతలమీద పగదీర్చుకొను సమయమాసన్నమైన దని తలచి , సకల పరివార సమేతముగా ,
ఆగ్రహావేశపరుపరాలై , దేవ లోకముమీద దండెత్తెను. ఆమెతో పోరాడుటకు దేవతలందరూ సంసిద్ధులై
నిలిచిరి. కానీ , వారి కులగురవైన బృహస్పతి మహిషికి బ్రహ్మదేవుడొసగిన వరముల వలన
త్రిమూర్తుల సైతము ఆమెను అణచివేయుటకు శక్తి చాలదనియు ఆమెతో యుద్ధము చేసిన యెడల
అపజయము తప్పదనియు తాత్కాలికముగా నైనను ప్రాణములను రక్షించుకొనుట తప్ప గత్యంతరము లేదనియు వివరముగా తెలిపి , వారిని యుద్ధము చేయక పారిపొమ్మని హెచ్చరించెను.
ఆ క్షణమున , దత్తాత్రేయుడు మహావిష్ణువు యొక్క ఆదేశము ననుసరించి , ఒక మహిషముగా
రూపమును దాల్చి సుందరమహిషమును పేరును వహించి , మహిషి మనస్సును మరలించి ,
దేవలోకము నుండి ఆమెను దూరముగా గొనిపోయెను. దేవలోకము మరల అమరుల
హస్తగతమయ్యెను. కాలక్రమేణ మహిషికి దేవతలకు తంత్రము అవగతమయ్యెను. తన అసుర సేనాగణములతో మరల దేవలోకమును చుట్టుముట్టెను. పిడుగుపాటువలె గర్జనము గావించుచు ,
తమను యుద్ధమునకు రమ్మని పిలుచుచున్న మహిషి యెదుట నిలుచుండుట కైనను దేవతలకు సాహసము కలుగదయ్యెను. అత్యంత శీఘ్రముగా అసురులు దేవలోకము నాక్రమించుకొనిరి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*