220. అయ్యా నీగుడిలో వెలిగేదీపం నైపోనా | Ayyā nīguḍilō veligēdīpaṁ naipōnā | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

220. అయ్యా నీగుడిలో వెలిగేదీపం నైపోనా | Ayyā nīguḍilō veligēdīpaṁ naipōnā | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
అయ్యా నీగుడిలో వెలిగేదీపం నైపోనా
అయ్యప్ప నీపాదపూజకు పువ్వుగామారణా (2)

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా  (2)
మలవేసుకొని  చూడనోచని కన్నులెందుకయ్యా
నిన్నుపూజించే భాగ్యములేని చేతులు ఎందుకయ్యా
నీసన్నిధికిచేరలేనీ ఈ కాళ్లు ఎందుకయ్యా
నీ నామాన్ని పలుకలేని నాలుక ఎందుకయ్యా
నినుస్మరించే హరహరలేని జన్మ మెందుకయ్యా 
||అయ్యా నీగుడిలో ||
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా  (2)

సిరిసంపదలు కలిగిననాడు గర్వంతో ఉంటి
సర్వంపోయిన తరువాత మాలే  వేసుకుంటి
పైపైమెరుపులతో నేనుమురిసిపోయుంటి
అంతులేనివ్యాధులతో నేనునిన్నుచేరుకుంటి
పాపకూపమున మునిగిపోతున్నా చెరదియమంటి
                                                               ||అయ్యా నీగుడిలో ||
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా  (2)

నమ్మినవారినివమ్ముచేయవని నిన్నునమ్ముకుంటి
అహంకారమువిడిచి ఆర్తిగానిన్నువేడుకుంటి
దీనుడనైననాదిక్కునీవనినిన్నుమొక్కుకుంటి
తప్పులన్నీమన్నించినన్నుకరుణచూడమంటి
కన్నతండ్రివై కనికరించనన్నుకపాడమంటి

                                                            ||అయ్యా నీగుడిలో ||
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా  (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow