224. నా గుండెలోకి తొంగి చూస్తే గుండెలోన ఉంటవు | Naa Gundeloki || Gangaputra Narsing Rao | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી

224. నా గుండెలోకి తొంగి చూస్తే గుండెలోన ఉంటవు | Naa Gundeloki || Gangaputra Narsing Rao | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
పల్లవి:
నా గుండెలోకి తొంగి చూస్తే
గుండెలోన ఉంటవు ఓ స్వామి
నీకు తెలియదా

నా ఊపిరాగిపోయేదాకా
ఊపిరిలో ఉంటవు
నా మీద దయ రాదా

41 రోజు దీక్షలుండలేనా...
నిష్టతోని నేల మీద పండలేనా అయ్యప్పా...

ఇంకా నా బ్రతుకు మారదేమి అయ్యప్పా
కష్టాలెనక కష్టాలచ్చుడే ఏమి...
నా గుండెలోకి
 
చరణం 1:
స్వామి మా నాన్న స్వామి
నీ మాల వేయలేదా
నాన్న ఉన్ననాళ్ళూ
నీతో ఉండలేదా

నన్ను నీ పూజలోకి
తీసుకెళ్ళలేదా...
నా మనసు నిండ
నిన్ను నింపలేదా

నిత్యము నిన్ను ఆరాధించే
మా నాన్నకేమి చేసినావు నీవు

ఆ గద్ద వచ్చి
కోడి పిల్లనెత్తికెళ్ళినట్టు
నాన్న ప్రాణాలెత్తుకెళ్ళినావు

మా నాన్న లేని
ఉండలేను నేను...
గుండెలసిపోయేటట్టు
ఏడ్చాను అయ్యప్పా
 
చరణం 2:
మా అమ్మ స్వామి
రోజు నీకు మొక్కలేదా
ఇల్లు సల్లగుండాలని
వేడలేదా

మన దిక్కు నువ్వే
నీకంట స్వామి అనలేదా...
ఓ స్వామి
నిన్ను మర్చిపోయినాదా

నీ సేవ చేసినా
మా అమ్మకేమి చేసినావు...
పానాలే పట్టుకెళ్ళావు

కళ్ళలోన కదులుతుంటే వాళ్ళు...
నా కళ్ళలోన నిండిపోయే
కన్నీళ్ళు అయ్యప్పా
 
చరణం 3:
అయినా గాని
నీ మాల మరువ మనసు లేదు
గుండెలోన ఉన్న బాధ
పోతలేదు

పుట్టిన ప్రతి జీవి
గిట్టక తప్పదంటూ
కలలొచ్చి చెప్పినావు

నా తల్లిదండ్రులే
నా బిడ్డలుగా పుట్టించి
నా కళ్ళు తుడిచినావు

నీ రుణమెట్ల తీర్చుకుందు స్వామి...
నా పూజలన్నీ ఫలించినాయి నేడు

మా ఇంటిలోన
వెలుగులను నింపినావు...
నా గుండెలోకి

పాట విశేషాలు:
గానం: గంగాపుత్ర నర్సింగ్ రావు
నేపథ్యం: ఇది ఉప్పల్ రమణ స్వామి అనే భక్తుని నిజ జీవిత ఆధారంగా రూపొందించబడిన పాట.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow