ఎవరూ ఎరుగరు శివయ్య – నీ మహిమల చిత్రాలు
శంభో శంకర హరహర – ఈశ్వర నీ లీలలు
తలపైన గంగను మోస్తావు – జగమంతా నీళ్లు ఇస్తావు
మెడలోన పామును వేస్తావు – భయమును బాపి బ్రోస్తావు
ముక్కంటివై నువ్వు చూస్తావు – ముల్లోకాలను కాస్తావు
||ఏమిటయ్యా ఈశ్వర ||
భస్మాన్ని ఒంటికి పూస్తావు – భక్త జనులను బ్రోస్తావుశ్మశాన వాటికలో ఉంటావు – శాంతిని మాకు ఇస్తావు
డమరుకము చేత బడతావు – తాండవ నృత్యం చేస్తావు
||ఏమిటయ్యా ఈశ్వర ||
అర్ధనారీశ్వరుడవు నీవే – అఖిలాండ నాయకుడవు నీవేనిన్నే నమ్మిన వారందరికీ – నీడై తోడై ఉంటావు
కైలాస గిరిపై ఉంటావు – కరుణను మాపై చూపిస్తావు
||ఏమిటయ్యా ఈశ్వర ||
