Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

89. హర హర శంకర శివ శివ శంకర | Hara Hara Shankara | శివ భజన పాటల లిరిక్స్

హర హర శంకర శివ శివ శంకర
అభయము నీవే ఆదిశంకరా
శంభో శంకర హరహర శంకర
శరణము నీవే సాంబశివా

పాలాక్షుడవు పరంధాముడవు
పాప వినాశన పరమేశ్వరుడవు
నంది వాహన నటనేశ్వరుడవు
నమ్మిన భక్తుల నాథుడవు నీవు
||హర హర శంకర ||
కైలాసవాసా కరుణా సాగరా
గంగాధరా గౌరీ మనోహరా
త్రిశూల ధారి త్రినేత్ర ధారి
ముల్లోకాలను ఏలే ముక్కంటి సామి
||హర హర శంకర ||
భక్త జనులకు నీవే దిక్కు
భయమును బాపే పరమశివుడవు
ముక్తిని ప్రసాదించే ముక్కంటివి
నిరతము నిన్నే కొలుస్తామయ్యా
||హర హర శంకర ||
📢 Follow