అంజనమ్మ తనయుడా ఓ హనుమంత రావయ్యా ||2||
అయోధ్య రాముడికి నీవు బంధువువయ్యా ||2||
జై జై రామ జానకి రామ జై జై రామ రఘుపతి రామ ||2||
జై జై రామ జానకి రామ జై జై రామ సీతారామ ||2||
మా రెండు కన్నులలోనా నిన్నే నిన్నే చూస్తున్నాము
నీ నిండు గుండెలలోనా రాముని నీవు దాచితివయ్యా ||2||
జై జై రామ జానకి రామ జై జై రామ రఘుపతి రామ
జై జై రామ జానకి రామ జై జై రామ సీతారామ
రాముని ముద్రిక చూపి సీతమ్మ శోకము ఆపావు
లంకలోనే నీవు లంకిణిని కూల్చినావయ్యా ||2||
జై జై రామ జానకి రామ జై జై రామ రఘుపతి రామ
జై జై రామ జానకి రామ జై జై రామ సీతారామ
లక్ష్మణుడు మూర్ఛిల్లినాడు సంజీవి తెచ్చినావయ్యా
రాముడి మనసులోనా బాధలు తీర్చినావయ్యా ||2||
జై జై రామ జానకి రామ జై జై రామ రఘుపతి రామ ||2||
జై జై రామ జానకి రామ జై జై రామ సీతారామ ||2||
అంజనమ్మ తనయుడా ఓ హనుమంత రావయ్యా
అయోధ్య రాముడికి నీవు బంధువువయ్యా ||2||