పంచామృతాభిషేకము (విధి)
గోక్షీరము, గోదధి, తేనె, గోఘృతము, శర్కర (చక్కెర) ఈ అయిదింటిని ఒక పాత్ర (పాత్ర)లో వేసి ఈ దిగువ మంత్రమును పఠిస్తూ అభిషేకమును జేయించవలెను.
మంత్రము :-
ఆప్యాయస్వసమేతుతే, విశ్వతః సోమవృష్ణియం |
భవావాజస్య సంగథే ||
“ఇతి పంచామృతేన స్నాపయామి”
“ఇతి పంచామృతేన స్నాపయామి”
ఇట్లు పంచామృతముతో నభిషేకించిన పిదప శుద్ధోదకముతో అభిషేకమొనర్పవలెను.
సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతాయవై నమోనమః
భవేభవేనాతి భవే | భవస్వమాంభవోద్భవాయనమః ||
“ఇతి శుద్ధోదకేనస్నాపయామి”
ఈ విధముగా శుద్ధోదకముతో నభిషేక మొనర్చి తదుపరి భస్మము, గంధము, అక్షతలు, పత్రి, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, మొదలగు వాటితో ౫ సార్లు పూజించి తరువాత లింగమునకు ప్రాణ ప్రతిష్ఠ గావించవలెను.