మంత్రము :-
ఓం అస్యశ్రీ శివ ప్రాణప్రతిష్ఠాపన మంత్రస్య బ్రహ్మ ఋషిః దేవీగాయత్రీచ్ఛందః ఓం బీజం, హ్రీం శక్తిః క్రౌం కీలకం | శివలింగ ప్రాణప్రతిష్ఠార్థం | జపేవినియోగః | ఓం హ్రీంక్రౌం, యం, రం, లం, వం, శం, షం, సం, హం, హంసః, అముష్య ప్రాణయిహస్థితః | అముష్యజీవ ఇహస్థితః | అముష్య సర్వేంద్రియాణి. కాయ వాఙ్మనశ్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణ ప్రాణ ఇహై వాగత్యసుఖం చిరం తిష్ఠంతు స్వాహా ఇతి లింగ ప్రాణప్రతిష్ఠాపనం కుర్యాత్ ||
ఈ ప్రకారముగా లింగమునకు ప్రాణప్రతిష్ఠాపన మొనర్చి అట్టి లింగమును ఒక మడి వస్త్రమునందు బంధించి ఉంచి పిదప నాశిశువును మొదలు జుట్టిన సూత్రమును విడువకుండ దీసికొనివచ్చి గురువు సమ్ముఖమున (ఎదుట) గూర్చుండవలెను. శ్రీగురువు ఆశిశువునకు పాదోదక పంచగవ్యాదులతో (పంచామృతముతో) సంప్రోక్షణయొనర్చి, శిశువు యొక్క నుదుట భస్మమును ధరించి ఆ శిశువు యొక్క రెండు కర్ణములందును (చెవుల్లో) పంచాక్షరీ మంత్రమును జెప్పి ఈ దిగువ (క్రింది) వ్రాయబడిన మంత్రములతో శిశువు యొక్క కంఠమునందు లింగధారణమును జేయవలెను.
మంత్రము :-
ఓం లింగధారణంత్రయోవేదాః శివలింగంధారయంతి తస్మాద్దేవా శివలింగంధారయంతి | యోవై లింగధారణంకుర్యాత్ | సమక్ శోభవంతి | నస్యవచోభవతి, శుకాద్యాః లింగం ధారయంతి, అజ హరిప్రముఖాశ్చశివలింగంధారయంతి | సురేంద్రాః దైత్యాః శివలింగంధారయంతి | తస్మాద్దేవా శివలింగంధారయంతి | యితఃప్రోవాచాథర్వణ శిఖా ఓం నమోబ్రహ్మణే లింగధారణం వేఒస్మిన్ నిరాకరణేధారయే ధాఃభూయ్యాస్సంకర్ణ యేళ్ళతం | మాచ్యోర్ధ్యం, మమాయుష్యం ఇత్యనేన మంత్రేణ శిశోఃకంఠే శివలింగంధారయేత్ ||
ఆశీర్వాద మంత్రము :-
శిశువు కంఠమునందు లింగధారణమును గావించి, తరువాత గురువు శిశువునకు ఈ దిగువ (క్రింద) వ్రాయబడిన మంత్రముతో నాశీర్వదించ వలయును.
మంత్రము :-
నమోనమో భవతిజాయ మానోస్వాం |
కేతు రుష సామేత్యగ్రే భాగందేవేభ్యో,
నితధ్యాయన్యచంద్రమాః స్థిరతర దీర్ఘమాయుః ||
ఇతి వేదవాక్యై నాశీర్వాదం దద్యాత్ ||
ఇట్లు ఆశీర్వదించిన పిదప పాదార్చన విధి యందు చెప్పిన ప్రకారముగా గురువు యొక్క పాదార్చన గావించి, ఆ శిశువునకు పాదోదకము నొసంగి, మిగతా వారందరు స్వీకరించి, గణతృప్తి యొనర్చి, దక్షిణ తాంబూలములతో మహేశ్వరులను సత్కరించి వారిని సాగనంపవలెను.ఇది లింగధారణ విధి సమాప్తము.