నీ పూజకు పువ్వులు తెచ్చినమయ్యా
మెడలో దండలు వేసినమయ్యా
అభయమునిచ్చి ఆదుకో అంజన్న
||కొండగట్టులో వెలసిన||
నిన్ను కొలువని భక్తులు లేరునిన్ను కొలువని జనులే లేరు
భక్తకోటికి అండగా ఉంటూ
భయభ్రాంతులను తొలగించేవు
బాధలు తీర్చే బంధువు నీవై
కొండగట్టుపై కొలువున్నావయ్యా
||కొండగట్టులో వెలసిన||
పూలు పండ్లతో పూజలు నీకుఅన్న పూజలతో అర్చన నీకు
జిల్లేడాకుల దండలు నీకు
తమలపాకుల మాలలు నీకు
గుండెల నిండా భక్తి నింపుకొని
దండిగా పూజలు చేస్తున్నామయ్యా
||కొండగట్టులో వెలసిన||
చందన తేజం నీదేనయ్యా
సింధూర వర్ణం నీదేనయ్యా
వాడవాడనా పూజలు అందే
వానర వీరుడు నీవేనయ్యా
శక్తి స్వరూపుడు నీవేనయ్యా
భక్త వరదుడు నీవే అంజన్న
సింధూర వర్ణం నీదేనయ్యా
వాడవాడనా పూజలు అందే
వానర వీరుడు నీవేనయ్యా
శక్తి స్వరూపుడు నీవేనయ్యా
భక్త వరదుడు నీవే అంజన్న
||కొండగట్టులో వెలసిన||
పాడి పంటలు పైలంగా చూసేపవన సుతుడవు నీవేనయ్యా
పిల్లజల్లలను చల్లంగా చూసే
మారుతి వీరుడు నీవేనయ్యా
మహిమలు గల కొండగట్టులో
మమ్ముల నేలగా వెలసిన అంజన్న
||కొండగట్టులో వెలసిన||
