పూర్వభాగం మహోచార్య, శ్వహరేయుర్యధాక్రమం |
ఉపసూత్రై స్సమాయుక్తా, శ్చైవమేవ వినిర్ణయః ||
తదర్ధం చైవ గృహీయా దుపాచార్యస్త తః పరం |
ఏకస్య భాగమేకశ్చ, గ్రహీతుం నైవచార్హతి ||
బలాదపిచ గృహీయాత్ముమానస్కందతా భవేత్ |
తేన దోషఫలం భుంక్త్వా, నరకానేవ విందతి ||
ఉపాచార్య పదార్ధంతు, మహోచార్య యదాహరేత్ |
తదాతేషాంచ మహతాం, న్యూనతా భవతి ధృవం ||
పంచపూర్ణా మహోచార్యా, ఉపాచార్యాశ్చ పంచధా |
ఏవం దశవిధానాం తు, భాగాశ్చ పరికల్పితాః ||౨||
తస్మాత్ దశవిధం తత్ర, ఫల నైవేద్యకంన్యసేత్ |
పంచపూర్ణాచ నిక్షిప్య, తదర్ధం పంచధాక్షిపేత్ ||
తా||
తా||
దీక్షా వివాహ కార్యములందు పంచ కలశములను స్థాపించిన సమయములో మహోచార్యులకు ౫ (పరడీలను) హక్కు బాపతులను ప్రత్యేకముగా వేర్వేరు క్రొత్త వస్త్రములలో గట్టి ఉంచి, వాటిని క్రమముగా మహోచార్యుల సూత్రములకు సంబంధించినవారు పంచుకొన వలెను. ఆ పిదప ఉప సూత్రములవారు క్రమముగా బంచుకొనాలి, ఇతర సూత్రములవారి కివ్వకుండా బలాత్కారముగా ఒక్కరే దీసికొనినయెడల మహా దోషమునకు ఒడిగట్టిన వారవుతారు. (గురికాగలరు) అందుచేత అందరు తమతమ సూత్రప్రకారముగానే పంచుకొనదగును.
ఇది వివాహవిధి, సంస్కార ప్రకరణము సమాప్తము.
ఇది వివాహవిధి, సంస్కార ప్రకరణము సమాప్తము.
